Holi Special: రంగుల కేళీ హోలీకి మీ లుక్ మెరిసిసోవాలంటే.. ఇలా ముస్తాబు అవ్వండి
ఈ వార్తాకథనం ఏంటి
సందేహమే లేదు... హోలీ అనగానే రంగుల సందడి, ఉత్సాహం, అల్లరి, ఆనందం - అన్నీ కుర్రకారు పండగకే ప్రత్యేకం!
కేరింతలు, ఆనంద నర్తనలు, స్నేహితులతో సరదాలు, చిలిపి గొడవలు - ఇవన్నీ హోలీ పండగలో తప్పనిసరిగా కనిపించే శోభ.
ఆ రోజు కేవలం రంగులలో మునిగిపోవడం మాత్రమే కాదు, మీ లుక్ కూడా ప్రత్యేకంగా మెరిసేలా చేయాలంటే ఇలా రెడీ అవ్వండి.
వివరాలు
అమ్మాయిల స్టైల్
తెలుపు రంగు కుర్తీకి ఎరుపు దుపట్టా జతచేస్తే హోలీ ఫెస్టివ్ లుక్ సంపూర్ణంగా అనిపిస్తుంది.
రంగుల అందం మరింత హైలైట్ అవ్వాలంటే వీటికి జతగా చాంద్‌బాలీలు, రంగురంగుల జుంకాలు వేసుకుంటే బాగుంటుంది.
సంప్రదాయానికి మోడ్రన్ టచ్ ఇవ్వాలనుకుంటే బ్రైట్ కలర్ స్కర్టులు, తగిన షూలు వేసుకుంటే మెరుపు చూపులతో అందరూ మిమ్మల్ని గమనించకుండా ఉండలేరు!
వివరాలు
అబ్బాయిల స్టైల్
అబ్బాయిలకు స్టైలింగ్ అవకాశాలు అమ్మాయిల కంటే తక్కువే అయినా, తెలుపు రంగు కుర్తాలు, స్టోల్స్, ఎంబ్రాయిడరీ జాకెట్ కోట్లు వేసుకుంటే ఫ్యాషన్ స్టేట్‌మెంట్ అవుతుంది.
ప్రత్యేకంగా వెస్ట్ జాకెట్ వేసుకుంటే హోలీ స్పెషల్ లుక్ మరింత ఆకర్షణీయంగా మారుతుంది.
రంగుల పండగను మరింత స్టైలిష్‌గా ఎంజాయ్ చేయాలంటే ట్రెండీ కూలింగ్ గ్లాసెస్ కూడా పెట్టుకోవచ్చు.
ఇవి కేవలం స్టైలింగ్‌కి మాత్రమే కాదు, రంగులు కళ్లలో పడకుండా కాపాడటానికి కూడా ఉపయోగపడతాయి.
వివరాలు
సెలెబ్రిటీల హోలీ ఫ్యాషన్
ఇప్పటికే సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో హోలీ ఫ్యాషన్ ట్రెండ్స్‌ను షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు.
బాలీవుడ్ స్టార్ రవీనా టాండన్ కుమార్తె రాషా టాండన్ ప్రత్యేకంగా హోలీ ఔట్‌ఫిట్ ఫొటోషూట్ చేసింది.
ఆమె గులాబీ క్రాప్డ్ షర్ట్, కార్గో డెనిమ్‌తో స్టైలిష్‌గా మెరిసింది. సారా అలీఖాన్ ఆక్వా బ్లూ ప్రింటెడ్ షర్ట్, హెయిర్‌బ్యాండ్, లావెండర్ బ్యాగ్‌తో హోలీ హంగామాను ముందే తెచ్చేసింది.
వేదాంగ్ రైనా న్యూట్రల్ టోన్ షర్ట్, కలర్‌ఫుల్ ప్రింటెడ్ ప్యాచ్, ట్రౌజర్స్‌తో తన ప్రత్యేకతను చాటుకున్నాడు.
హోలీ పండగను మరింత ఆనందంగా, స్టైలిష్‌గా సెలబ్రేట్ చేసుకోవాలంటే... మీకిష్టమైన రంగులు, ట్రెండీ డ్రెస్సులు, సరదా మూడ్‌తో రెడీ అవ్వండి!