కంటిచూపును మెరుగుపరిచే అద్భుతమైన జ్యూస్ లని ఇంట్లోనే తయారు చేసుకోండి
మారుతున్న కాలంలో కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగిపోతోంది. స్క్రీన్ టైమ్ పెరగడం వల్ల కంటికి సంబంధించిన సమస్యలు తలెత్తుతున్నాయి. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే కళ్ళకు మేలు చేసే కొన్ని పానీయాలు తాగండి. క్యారెట్, ఆపిల్, బీట్ రూట్ జ్యూస్: క్యారెట్లలోని విటమిన్ ఏ, బీట్ రూట్ లలోని జియాజాంతిన్, లూటిన్ అనే కెరాటాయిడ్లు కంటి రెటీనాకు ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటాయి. ఆపిల్స్ లోని బయోఫ్లేవనాయిడ్స్ వల్ల కంటిచూపు మెరుగుపడుతుంది. ఆపిల్ ముక్కల్ని, క్యారెట్, బీట్ రూట్ ముక్కల్ని ఒక పాత్రలో వేసి, కొంచెం అల్లం, నీళ్ళు, నిమ్మరసం కలిపి జ్యూస్ తయారు చేయాలి. చల్లగా ఉండాలనుకుంటే ఐస్ క్యూబ్స్ వేసుకుని అందరికీ సెర్వ్ చేయండి.
స్వీట్ పొటాటో, ఉసిరి వల్ల కంటికి కలిగే మేలు
స్వీట్ పొటాటో, గుమ్మడి జ్యూస్: గుమ్మడికాయ వల్ల వయసురీత్యా వచ్చే కంటి సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి. స్వీట్ పొటాటో వల్ల రేచీకటి రాకుండా ఉంటుంది. స్వీట్ పొటాటోని ముక్కలుగా కోసి, నీళ్ళు, అల్లం, పసుపు, గుమ్మడికాయ కలిపి జ్యూస్ తయారు చేయండి. ఇప్పుడు జ్యూస్ ని వడబోసి తాగండి. స్వీట్ పొటాటో, గుమ్మడికాయల్లో విటమిన్ ఏ, సి అధికంగా ఉంటుంది. ఉసిరి జ్యూస్: ఈ జ్యూస్ వల్ల కంటి కండరాలు బలపడి శుక్లాలు రాకుండా ఉంటుంది. ఇందులోని విటమిన్ సి వల్ల రెటీనా కణాలకు మంచి పోషకాలు అందుతాయి. ఉసిరికాయలను ముక్కలుగా కోసి అల్లం, నిమ్మరసం, నీళ్ళు కలిపి గ్రైండర్ లో వేయండి. జ్యూస్ తయారైన తర్వాత వడబోసి తాగండి.