నవారు మంచం లక్ష రూపాయలు; భారతీయ వస్తువుకు అమెరికాలో అదిరిపోయే రేటు
నవారు మంచానికి లక్ష రూపాయలా అని ఆశ్చర్యపోతున్నారా? నిజమే, మంచానికి లక్ష రూపాయాలేంటని అందరికీ అనిపిస్తుంది. కానీ అమెరికాకు చెందిన ఈ-కామర్స్ సంస్థ ఎట్సీ, తన ఆన్ లైన్ స్టోర్ లో నవారు మంచానికి 1,12,030రూపాయల రేటు పెట్టింది. ప్రస్తుతం ఈ వార్త ట్రెండింగ్ లో ఉంది. ఇండియాలో తక్కువ రేటు పలికే మంచానికి అమెరికాలో అంత రేటు పలకడం ఏంటని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎట్సీ పోర్టల్ లో ఈ మంచం గురించి, అందంగా అలంకరించిన భారతీయ సాంప్రదాయ పడక మంచం అని వివరించారు. ఈ మంచం పొడవు 72అంగుళాలు, అడ్డం 36అంగుళాలని ఉంది. ఇంత ఖరీదైన నవారు మంచాన్ని ఎవరు కొంటారన్న అనుమానం ఎవ్వరికైనా వస్తుంది.
వివిధ రకాల్లో దొరుకుతున్న మంచాలు
లక్ష రూపాయలు పెట్టి మంచం ఎవరూ కొనరని అనుకోవద్దు. ఆల్రెడీ సేలింగ్ బాగానే ఉందట. సైట్ లో చూపించిన దాని ప్రకారం, ఇంకా నాలుగు మాత్రమే స్టాక్ లో ఉన్నాయని కనిపిస్తుంది. 82అమ్మకాలు: ఇప్పటి వరకు 82మంచాలు అమ్ముడైపోయాయని సమాచారం. ఎట్సీ సైట్ లో వివిధ రకాల మంచాలు దొరుకుతున్నాయి. కొన్ని మంచాలు నవారుతో ఉంటే మరికొన్ని తాళ్ళతో చేసినవి ఉన్నాయి. గతంలో ఆస్ట్రేలియాకు చెందిన బాలెన్షియెగా అనే కంపెనీ, ఒక హ్యాండ్ బ్యాగును తయారు చేసింది. 90శాతం దూడ చర్మం, 10శాతం గొర్రె చర్మంతో తయారైన ఈ హ్యాండ్ బ్యాగ్ ధర 1,46,828రూపాయలుగా ఉండింది.