Food: విదేశీయులు ఎక్కువగా ఇష్టపడే భారతదేశ వంటకాలు ఇవే
భారతదేశ ఆహార సాంప్రదాయాలు ప్రపంచవ్యాప్తంగా చాలా పేరు తెచ్చుకున్నాయి. భారతదేశంలో ఎన్నో రకాల వంటకాలు మనకు కనిపిస్తాయి. ప్రస్తుతం విదేశీయులకు నచ్చే మన వంటకాలు ఏంటో తెలుసుకుందాం. దక్షిణ భారత వంటకాలు: దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల్లో దోస చాలా ఫేమస్. ఇక్కడ దోసల్లో చాలా రకాల వెరైటీలు మనకు కనిపిస్తాయి. జర్మనీలోని బెర్లిన్ నగరంలో దోస అండ్ మోర్ అనే రెస్టారెంట్లో దోస తినడానికి జనాలు ఎంతగానో ఆసక్తి చూపిస్తారు. ఉత్తర భారత వంటకాలు: ఇక్కడ దాల్ మక్కని, నాన్ రాజ్మా చావాల్, చోలే బటూరే, పానీ పూరి, సమోసా, ఆలు చాట్ వంటి వంటకాలు చాలా ఫేమస్. ఈ వంటకాలు అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, జపాన్, జర్మనీ దేశాల్లో కూడా కనిపిస్తాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఆకట్టుకునే బిర్యాణీ
గుజరాతీ వంటకాలు: డోక్లా, ఖాండ్వీ, తెప్ల, హండ్వో, ఘటియా, ఉందియు, మొదలగు వంటకాలు గుజరాత్ లో చాలా ఫేమస్. ఈ వంటకాలను అమెరికా, ఆస్ట్రేలియా, థాయిలాండ్, యునైటెడ్ కింగ్డమ్ దేశాల వారు బాగా ఇష్టపడతారు. బెంగాలీ వంటకాలు: బెంగాలీ వంటకాల్లో స్వీట్స్ చాలా ప్రత్యేకమైనవి. రసగుల్లా, మిస్తీ దోయ్, రస్ మలై, చోంచోం, సందేశ్ మొదలగు వంటకాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి గిరాకీ ఉంది. అమెరికా, జపాన్, కెనడా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యూనిటెడ్ కింగ్డమ్ వంటి దేశాల్లో ప్రజలు ఈ వంటకాలను బాగా ఇష్టపడతారు. మొఘలాయి వంటకాలు: బిర్యానీ, మలై కోఫ్తా, నవరత్న కూర్మా వంటి వంటకాలు ప్రపంచవ్యాప్తంగా విదేశీయులను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి.