ఉబర్ యాప్ లో తప్పులు కనిపెట్టి 4.6లక్షలు రివార్డు అందుకున్న ఆనంద్ ప్రకాష్
ప్రస్తుతం అంతా యాప్స్ మీదే నడుస్తుంది. వేసుకునే షర్ట్ ని కొనడం దగ్గర నుండి హోటల్ లో తాగిన ఛాయ్ బిల్ కట్టడం వరకూ అన్నీ యాప్స్ వల్లే అవుతున్నాయి. అయితే ఈ యాప్స్ లో కొన్ని కొన్ని తప్పులు కనిపిస్తుంటాయి. సాంకేతికంగా వాటిని బగ్స్ అంటారు. ఆ బగ్స్ కారణంగా యాప్ యజమానులు చాలా నష్టపోతారు. అలా నష్టపోయిన వారిలో ఉబర్ యాప్ కూడా ఒకటి. ఉబర్ యాప్ లో ఏర్పడిన బగ్ కారణంగా చాలా నష్టాల్లో కూరుకుపోయింది. సైబర్ సెక్యూరిటీ సంస్థను స్థాపించిన ఎథికల్ హ్యాకర్ ఆనంద్ ప్రకాష్, ఉబర్ యాప్ లో ఉన్న బగ్ ని గుర్తించాడు. ఆ బగ్ కారణంగా కస్టమర్లకు ఫ్రీ రైడ్స్ వస్తుండేవి.
24గంటల్లో బగ్ ని క్లియర్ చేసిన ఉబర్
కస్టమర్లు ఉబర్ లో రైడ్ బుక్ చేసుకున్నప్పుడు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఆ పేమెంట్ ని అందులో కనిపించే పద్దతుల్లో కాకుండా వేరే విధంగా చేయడం వల్ల కస్టమర్లకు ఫ్రీ రైడ్ వచ్చేది. ఎలాంటి డబ్బులు కట్టకుండానే ఫ్రీ రైడ్ వచ్చేది. ఈ బగ్ ని ఆనంద్ ప్రకాష్ గుర్తించాడు. ఏదో సరదాగా ఉబర్ యాప్ ని చెక్ చేస్తూ ఈ బగ్ ని కనిపెట్టాడు. వెంటనే ఉబర్ యజమాన్యానికి దీని గురించి తెలియజేసాడు. తనను తాను సమీక్షించుకున్న ఉబర్, 24గంటల్లోనే బగ్ ని క్లియర్ చేసింది. ఇలా తమ తప్పిదాన్ని గుర్తించినందుకు 4.6లక్షల రివార్డును అందజేసింది. ఈ విషయాన్ని ఆనంద్ ప్రకాష్, తన లింక్డ్ ఇన్ పేజీలో చెప్పుకొచ్చారు.