LOADING...
Dry Gulab Jamun: సింపుల్​గా చేసుకునే డ్రై గులాబ్ జామూన్ రెసిపీ.. నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి!
నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి!

Dry Gulab Jamun: సింపుల్​గా చేసుకునే డ్రై గులాబ్ జామూన్ రెసిపీ.. నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి!

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 05, 2026
09:52 am

ఈ వార్తాకథనం ఏంటి

నోట్లో పెట్టగానే మెల్లగా కరిగిపోయే గులాబ్‌ జామూన్‌ అంటే చాలామందికి ప్రత్యేకమైన ఇష్టం. సాధారణంగా వీటిని ఎన్నో రకాల పదార్థాలతో తయారు చేస్తుంటారు. కానీ మీరు ఎప్పుడైనా డ్రై గులాబ్‌ జామూన్ రుచి చూసారా? ఇంకా ట్రై చేయలేదంటే, ఇప్పుడు చెప్పబోయే విధానంలో ఒక్కసారి ఇంట్లో చేసి చూడండి... ఫలితం అదిరిపోతుంది. చాలా తక్కువ పదార్థాలతో, తక్కువ సమయంలో ఇన్‌స్టంట్‌గా తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇలా తయారుచేస్తే నాలుగు రోజుల వరకూ నిల్వ ఉంటుంది. ఇంటికి అతిథులు వచ్చినప్పుడు లేదా ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో ఈ డ్రై గులాబ్‌ జామూన్‌తో వారికి మంచి సర్‌ప్రైజ్ ఇవ్వొచ్చు. ఇక ఆలస్యం ఎందుకు? డ్రై గులాబ్‌ జామూన్ తయారీ విధానం తెలుసుకుందాం.

వివరాలు 

కావలసిన పదార్థాలు :

పచ్చికోవా - 300 గ్రాములు మైదాపిండి - 125 గ్రాములు కార్న్‌ఫ్లోర్ - 2 టీ స్పూన్లు పంచదార - ఒకటిన్నర కప్పు రోజ్ వాటర్ - 1 టీ స్పూన్ ఆయిల్ - డీప్ ఫ్రైకి అవసరమైనంత కొబ్బరి పొడి - అర కప్పు యాలకుల పొడి - ముప్పావు టీ స్పూన్

వివరాలు 

తయారీ విధానం :

మొదట ఒక పెద్ద గిన్నెలో 300 గ్రాముల పచ్చికోవా, 125 గ్రాముల మైదాపిండి వేయాలి. దీనిలో రెండు టీ స్పూన్ల కార్న్‌ఫ్లోర్‌, ముప్పావు టీ స్పూన్ యాలకుల పొడి కలిపి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని చిన్న చిన్న బాల్స్‌లా జామూన్ ఆకారంలో తయారు చేసి పక్కన పెట్టాలి. తర్వాత స్టవ్‌పై కడాయి పెట్టి ఒకటిన్నర కప్పుల పంచదారతో పాటు ఒకటిన్నర కప్పుల నీళ్లు వేసి మరిగించాలి. పంచదార పూర్తిగా కరిగి పాకం వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి. అందులో ఒక టీ స్పూన్ రోజ్ వాటర్ వేసి బాగా కలపాలి. మొదట రెండు నిమిషాల పాటు కలపకుండా అలాగే ఉంచాలి.

Advertisement

వివరాలు 

తయారీ విధానం :

అనంతరం జామూన్‌లను నెమ్మదిగా తిప్పుతూ లో ఫ్లేమ్‌లోనే రెండు వైపులా దోరగా వేగనివ్వాలి. ఆ తర్వాత మంటను మీడియం ఫ్లేమ్‌కు పెంచి గోల్డెన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేయాలి. బాగా వేగిన జామూన్‌లను వెంటనే ముందుగా తయారు చేసుకున్న పంచదార పాకంలో వేసి సుమారు 30నిమిషాల పాటు నానబెట్టాలి. అరగంట తర్వాత వాటిని ఒక గిన్నెలోకి తీసి గంటసేపు అలాగే పక్కన ఉంచాలి. ఇప్పుడు మరో కప్పులో అర కప్పు కొబ్బరి పొడి తీసుకోవాలి. జామూన్‌లను ఒక్కొక్కటిగా తీసుకుని కొబ్బరి పొడిలో రెండు వైపులా బాగా ఒలిపించి ప్లేట్‌లో పెట్టాలి. ఇంతే..రుచికరమైన డ్రై గులాబ్‌ జామూన్ తయారైనట్టే! తర్వాత వీటిని ఎయిర్‌టైట్ డబ్బాలో నిల్వ చేసుకుంటే నాలుగు రోజుల వరకు తాజాగా ఉంటాయి.

Advertisement