Loading...
Jowar Chilla : జొన్నతో రొట్టెలు కాకుండా.. ఈసారి చిల్లా ట్రై చేయండి!
జొన్నతో రొట్టెలు కాకుండా.. ఈసారి చిల్లా ట్రై చేయండి!

Jowar Chilla : జొన్నతో రొట్టెలు కాకుండా.. ఈసారి చిల్లా ట్రై చేయండి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 17, 2026
02:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

జొన్నపిండితో సాధారణంగా రొట్టెలే ఎక్కువగా చేస్తుంటారు. కానీ అదే జొన్నపిండితో ఎంతో మృదువుగా, రుచికరంగా ఉండే చిల్లాను కూడా సులభంగా తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ రెసిపీ చాలా తక్కువ సమయంలో, ఎక్కువ కష్టపడకుండా ఈజీగా చేసుకునేలా ఉంటుంది. సరైన కొలతలు, సరైన విధానం పాటిస్తే చిల్లా ఎంతో టేస్టీగా వస్తుంది. ఇప్పుడు దీని కోసం అవసరమైన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం.

వివరాలు

కావాల్సిన పదార్థాలు

జొన్నపిండి - 2 కప్పులు

బొంబాయి రవ్వ - 6 టేబుల్ స్పూన్లు

ఉప్పు - రుచికి సరిపడా

పెరుగు - అర కప్పు

క్యాప్సికం - 1

క్యారెట్ - 1

ఉల్లిపాయ - 1

కొత్తిమీర తరుగు - కొంచెం

అల్లం - కొద్దిగా

పచ్చిమిర్చి - 4

బేకింగ్ సోడా - 1 టీ స్పూన్

నువ్వులు - కొద్దిగా

వివరాలు

తయారీ విధానం

మొదట ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో జొన్నపిండి, బొంబాయి రవ్వ వేయాలి. తర్వాత పెరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి.

అనంతరం సుమారు రెండు కప్పుల నీరు పోసి మిశ్రమాన్ని సాఫ్ట్‌గా కలిపి, మూతపెట్టి 15 నిమిషాలు నానబెట్టాలి.

ఇంతలో ఉల్లిపాయ, క్యాప్సికం, పచ్చిమిర్చిని సన్నగా తరగాలి. క్యారెట్, అల్లం తొక్క తీసి సన్నగా తురుముకోవాలి.

ఇప్పుడు నానబెట్టిన జొన్నపిండి మిశ్రమంలో ఈ తరిగిన కూరగాయలన్నీ వేయాలి.

అలాగే కొత్తిమీర కూడా కలపాలి. మరో కప్పు నీరు పోసి మిశ్రమాన్ని బాగా కలపాలి. చివరగా బేకింగ్ సోడా వేసి కలిపితే చిల్లా కోసం కావాల్సిన బ్యాటర్ సిద్ధమవుతుంది.

ADVERTISEMENT

వివరాలు

తయారీ విధానం1/2

తర్వాత స్టవ్‌పై దోసె పాన్ పెట్టి కొద్దిగా నువ్వులు చల్లాలి. గరిటెతో పిండిని తీసుకుని పెనంపై దోసెలా పోయాలి.

పై నుంచి కొద్దిగా నూనె వేసి లో ఫ్లేమ్‌పై నెమ్మదిగా కాల్చాలి. ఒక వైపు కాలిన తర్వాత తిప్పి మరో వైపు కూడా బాగా కాల్చాలి.

రెండు వైపులా కాలిన తర్వాత ప్లేట్‌లోకి తీసుకుని, మిగిలిన పిండితో కూడా ఇదే విధంగా చిల్లాలు తయారు చేసుకోవాలి.

ఇవి మీకు నచ్చిన చట్నీ లేదా కర్రీతో సర్వ్ చేస్తే ఇంకా రుచిగా ఉంటాయి

ADVERTISEMENT

వివరాలు

చిట్కాలు

క్యారెట్, క్యాప్సికంతో పాటు మీకు నచ్చిన ఇతర కూరగాయలను కూడా ఉపయోగించవచ్చు.

పిండి మరీ పల్చగా లేదా గట్టిగా కాకుండా సరైన దట్టతతో ఉండాలి.

పెనం మీద పోసినప్పుడు స్వల్పంగా స్ప్రెడ్ చేస్తే చిల్లా బాగా వస్తుంది.

ఇలా చేస్తే ఇంట్లోనే సూపర్ సాఫ్ట్, టేస్టీ జొన్న చిల్లా సులభంగా తయారు చేసుకోవచ్చు.

ADVERTISEMENT