ఇంటర్నేషనల్ డాన్స్ డే: డాన్స్ నేర్చుకోవాలనే ఆసక్తి మీలో ఉంటే ఈ స్టైల్స్ తో ప్రారంభించండి
ఈ వార్తాకథనం ఏంటి
మీకు డాన్స్ అంటే ఇష్టమా? కానీ డాన్స్ ఎలా చేయాలో మీకు తెలియట్లేదా? డాన్స్ నేర్చుకోవడానికి చాలా సమయం వెచ్చించాలి. మంచి కమిట్మెంట్ ఉంటే తప్ప డాన్స్ నేర్చుకోలేం.
మీకు డాన్స్ నేర్చుకోవాలని ఉంటే తొందరగా నేర్చుకోగలిగే ఈ డాన్స్ స్టైల్స్ ని నేర్చుకోవడం ప్రారంభించండి. ఫుట్ స్టైల్ కాళ్లతో చేసే మూమెంట్స్ మీకు సౌకర్యంగా ఉన్నట్లయితే ఈ స్టైల్ మీకు సరిగ్గా సరిపోతుంది.
ఫుట్ స్టైల్:
డ్యాన్స్ లో చాలా రకాలు ఉన్నాయి. కొత్తగా నేర్చుకోవాలనుకునే వారు చిన్న చిన్న స్టెప్పుల నుండి ప్రారంభిస్తే బాగుంటుంది. ఫుట్ స్టైల్ డాన్స్ లో ట్యాప్ డాన్స్ అనే రకాన్ని ఈజీగా నేర్చుకోవచ్చు.
Details
సంగీతానికి అనుకూలంగా శరీరాన్ని కదిలించే డాన్స్ స్టైల్
హిప్-హాప్
హిప్-హాప్ మ్యూజిక్, కల్చర్ నుండి దిగుమతి అయిన ఈ డాన్స్, చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఆఫ్రికన్ డాన్స్, ట్యాప్ డాన్స్, బ్యాలెట్ డాన్స్ అనే రకాలు ఈ డాన్స్ లో ఉంటాయి.
ఫిలిం డాన్స్
సినిమాల్లో మనకు కనిపించే డాన్స్ ఇది. దీనిలో ఫోక్ డాన్స్, వెస్ట్రన్ డాన్స్, క్లాసికల్ డాన్స్ అనే రకాలు ఉన్నాయి. వెస్ట్రన్ డాన్స్ అంశాలను ఇండియన్ డాన్స్ అంశాలతో మిక్స్ చేసి ఫిలిం డాన్స్ ని నేర్పిస్తారు.
ఫ్రీ స్టైల్:
మన శరీరాన్ని ఫ్రీగా మనకు ఇష్టం వచ్చినట్టుగా కదిలించడమే ఈ స్టైల్ ఉద్దేశం. సంగీతానికి అనుగుణంగా బాడీని కదిలిస్తూ పోవడమే ఫ్రీ స్టైల్ డాన్స్.