అంతర్జాతీయ గణిత దినోత్సవం: ప్రకృతిలో మిళితమైన ఫిబోనాచీ సీక్వెన్స్ గురించి మీకు తెలుసా?
ఫిబోనాచీ సీక్వెన్స్, గోల్డెన్ రేషియో అనేవి గణిత శాస్త్రంలో చెప్పుకోదగ్గ కాన్సెప్ట్. కొన్ని వందల యేళ్ళ నుండి ఈ పద్దతులపై అధ్యయనం జరుగుతోంది. ప్రకృతిలోని ప్రతీ అందమైన వస్తువు ఈ గోల్డెన్ రేషియో విలువకు దగ్గరగా ఉంటుంది. ఫిబోనాచీ సీక్వెన్స్: 0,1తో ప్రారంభమయ్యే ఈ సీక్వెన్స్, అందులోని చివరి నంబర్ తో మొదటి నంబర్ కూడుకుంటూ వెళ్ళాలి. అలా కూడిన తర్వాత వచ్చిన సంఖ్యను, దానికన్నా ముందున్న సంఖ్యతో కూడాలి. ఈ వరుస క్రమం ఏ విధంగా ఉంటుందంతే, 0, 1, 1, 2, 3, 5, 8, 13, 21, 34, 55, 89, 144.... సాగుతూ పోతుంది. ఈ వరుస క్రమాన్ని 1202 సంవత్సరంలో లియోనార్డో ఫిబోనాచీ కనుగొన్నారు.
ప్రకృతిలో ఫిబోనాచీ సీక్వెన్స్ ఉదాహరణలు
ఈ ఫిబోనాచీ వరుస క్రమానికి ప్రకృతిలో కొన్ని ఉదాహరణలున్నాయి. సూర్యపువ్వులోని విత్తనాలు ఫిబోనాచీ వరుస క్రమంలోనే ఉంటాయి. గోల్డెన్ రేషియో: ఫిబోనాచీ సీక్వెన్స్ లోని ఏవైనా రెండు వరుస సంఖ్యలను తీసుకున్నప్పుడు వాటి నిష్పత్తి 1.618విలువకు దగ్గరగా ఉంటుంది. దీన్నే గోల్డెన్ రేషియో అంటారు. ఈ గోల్డెన్ రేషియో విలువకు దగ్గరగా ఉన్న ఏదైనా అందంగా కనిపిస్తుందని చెబుతారు. మన శరీరంలో ముంజేతికి, చేతికి మధ్య దూరం, గోల్డెన్ రేషియోకు దగ్గరగా ఉంటుంది. గోల్డెన్ రేషియో ప్రకారమే ప్రఖ్యాత పెయింటర్, లియోనార్డో డావిన్సీ.. మోనాలీసా చిత్రపటాన్ని గీసాడు. తాజ్ మహల్ పొడవు, వెడల్పుల నిష్పత్తి, గోల్డెన్ రేషియో విలువకు దగ్గరగా ఉంటుంది.