ట్రావెల్: ఫిన్ లాండ్ పర్యటనకు వెళ్తే గుర్తుగా తీసుకురావాల్సిన వస్తువులు
ఈ వార్తాకథనం ఏంటి
ఫిన్ లాండ్ పర్యటనకు వెళ్ళినపుడు అక్కడి నుండి ఏం తీసుకురావాలో మీకు ఐడియా లేకపోతే, ఇక్కడ చెప్పే కొన్ని వస్తువులను గుర్తించుకోండి. ఫిన్ లాండ్ దేశ సంస్కృతి, వైవిధ్యంగా ఉంటుంది. దానివల్ల అక్కడ వివిధ రకాల వస్తువులు మీకు కొత్తగా కనిపిస్తాయి.
ఫిన్ లాండ్ నుండి గుర్తుగా తీసుకురావాల్సిన వస్తువులు
డిజైన్ వస్తువులు
ఫిన్ లాండ్ డిజైనింగ్ వస్తువులు ఎక్కువగా ఉంటాయి. ఎలాంటి వస్తువులైన ఇక్కడ రకరకాల డిజైన్లలో దర్శనమిస్తాయి. గాజు వస్తువులు, పింగాణీ, ఇంట్లో సామాను, బట్టలు మొదలైనవి కొత్త కొత్త డిజైన్లలో కనిపిస్తాయి.
కండువాలు, క్యాప్స్, లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్, చేతులకు గ్లవ్స్.. అన్నీ వివిధ రకాలుగా మీకు తారసపడుతుంటాయి.
పర్యాటకం
నోరూరించే చాక్లెట్స్ వెరైటీస్ ని గుర్తుగా తెచ్చుకోండి
చాక్లెట్స్:
ఫిన్ లాండ్ లో చాక్లెట్స్ మంచి రుచిగా ఉంటాయి. అంతేకాదు, వేరు వేరు రకాలు కనిపిస్తాయి. ఫేజర్, కార్ల్ ఫేజర్, పాండా రకం చాక్లెట్స్, బ్లూ బెర్రీస్, లికోరైస్ ఫ్లేవర్లలో దొరుకుతాయి.
బెర్రీస్:
ఆర్కిటిక్ ప్రాంతాల్లో బెర్రీస్ బాగా పెరుగుతాయి. ఫిన్ లాండ్ లో వేసవిలో బెర్రీస్ కి మంచి సీజన్ ఉంటుంది. బ్లూ బెర్రీస్, క్లౌడ్ బెర్రీస్, క్రాన్ బెర్రీస్, లింగోన్ బెర్రీస్, ఆర్కిటిక్ రాస్ప్ బెర్రీస్ ఫిన్ లాండ్ లో పెరుగుతాయి.
కత్తులు:
ఆకట్టుకునే డిజైన్ లకు పెట్టింది పేరుగా పిన్ లాండ్ గురించి ఇంతకుముందే చెప్పుకున్నాం. ఆ డిజైన్స్, కత్తుల్లో కనిపిస్తాయి. రకరకాల ఆకారాల్లో ఉన్న కత్తులు ఫిన్ లాండ్ మార్కెట్లలో కనిపిస్తుంటాయి.