
ట్రావెల్: రొమేనియా వెళ్ళినపుడు అక్కడి గుర్తుగా ఎలాంటి వస్తువులు తీసుకురావాలో తెలుసుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
ఏ ప్రాంతానికైనా పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఏదో ఒకటి ఇంటికి తీసుకు వస్తారు. ఆ ప్రాంతపు గుర్తుగా ఉంటుందని అక్కడి వస్తువులను జ్ఞాపకాలుగా తీసుకువస్తారు. అయితే రోమానియా దేశం వెళ్ళినప్పుడు ఎలాంటి వస్తువులు తీసుకురావాలనేది మనం ఇక్కడ తెలుసుకుందాం.
యూరప్ దేశమైన రొమేనియా.. మంచి పర్యాటక ప్రాంతం. ఇక్కడ చాలా వస్తువులు మనల్ని అబ్బురపరుస్తాయి. వాటిలోంచి ఎలాంటి వస్తువులు బహుమతిగా తీసుకురావాలంటే,
రొమేనియా సాంప్రదాయ బ్లౌజ్
వైట్ లేదా కాటన్ తో తయారు చేయబడి పొడవాటి చేతులు కలిగి ఉండే ఈ బ్లౌజ్, మెడ దగ్గర చేతులపైనా ఎంబ్రాయిడరీ డిజైన్ తో ఉంటుంది. ఇంతకుముందు ఈ బ్లౌజ్ ని ఆడ మగ ఇద్దరూ వేసుకునేవారు, ప్రస్తుతం కేవలం ఆడవాళ్ళ మాత్రమే వేసుకుంటున్నారు.
పర్యాటకం
గుర్తుగా మిగిలిపోయే చెక్క గరిటెలు, పూసల దండలు
చెక్క గరిటెలు
రొమేనియా దేశాల వారు తమ వంటగదిలో చెక్క గరిటెలను ఉపయోగిస్తారు. ఈ సంప్రదాయం వందల సంవత్సరాల నుండి ఉంది. ఒకే చెక్కతో తయారయ్యే ఈ గరిటెలు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. వివిధ రకాల ఆకారాల్లో మీకు కనిపిస్తాయి.
డ్రాకులా థీమ్ వస్తువులు
డ్రాకులా బొమ్మను కలిగి ఉన్న రకరకాల వస్తువులు మీకు కనిపిస్తాయి. చెవి కమ్మలు, కీ చెయిన్స్.. డ్రాకులా థీమ్స్ కలిగి ఉంటాయి. డ్రాకులా డిజైన్స్ కలిగి ఉన్న టీషర్ట్స్, హుడీలు బాగుంటాయి.
ఇంట్లో తయారు చేసే పూసలు
వివిధ రకాల రంగుల్లోని పూసలతో తయారయ్యే ఆభరణాలు చాలా గమ్మత్తుగా కనిపిస్తుంటాయి. పూసలతో తయారయ్యే మెడ గొలుసు, బ్రాస్లెట్, ఇంకా రకరకాల వస్తువులు ఇంటికి తెచ్చుకోవచ్చు.