ట్రావెల్: పూర్తి వైన్ తాగకుండానే మళ్లీ వైన్ పోస్తే తప్పుగా చూసే గ్రీస్ దేశం పద్ధతులు తెలుసుకోండి
గ్రీస్.. ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం. ఆ దేశ చరిత్ర, అందమైన భూభాగాలు, ఆశ్చర్యంగా అనిపించే సంస్కృతులు.. గ్రీస్ దేశానికి వెళ్లడానికి ఉత్సాహంగా అనిపిస్తాయి. అయితే ప్రతీ దేశంలోనూ వివిధ రకాల పద్ధతులు ఉన్నట్టు ఇక్కడ కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి. వాటి ప్రకారమే మసులుకుంటే అక్కడి స్థానికుల వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది కలగదు. గ్రీస్ దేశంలో ఎలాంటి తప్పులు చేయకూడదంటే, సందర్భానుసారంగా మాత్రమే ఓపా అనాలి: గ్రీస్ లో ఓపా అనే పదానికి చాలా ప్రాముఖ్యం ఉంది. అంతులేని ఆనందం కలిగినప్పుడు, ఉత్సాహం ఎక్కువైనప్పుడు లేదా ఏదైనా సర్ప్రైజ్ సమయంలో మాత్రమే ఓపా పదాన్ని వాడాలి. ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ వాడకూడదు.
వైన్ కి మర్యాద ఇవ్వకపోతే గ్రీస్ దేశస్తులకి కోపం వస్తుంది.
అరచేతిని చూపించకూడదు ఖాళీ అరచేతిని ఇతరులకు చూపించడం అమర్యాదగా ఉంటుంది. ఎందుకంటే తమ పురాతన బైజాంటీన్ సమయంలో ఖైదీలుగా ఉన్నవారు తముఖాలకు నల్లని మసి తగిలించుకొని అరచేతులను పైకెత్తి వీధుల్లో తిరిగే వారంట. అప్పటినుంచి అలా చూపించడం అమర్యాదగా భావిస్తున్నారు. గ్లాస్ లో వైన్ ఉండగా మళ్లీ వైన్ పోయకూడదు ఇలా చేయడం వల్ల మీరు తాగే వైన్ తాలూకు లక్షణాలకు మర్యాద ఇవ్వట్లేదని గ్రీస్ దేశస్తులు భావిస్తారు. అందుకే పూర్తిగా తాగిన తర్వాతే వైన్ పోయాలి. పెళ్లిళ్లకు అతిథిగా పిలిచినప్పుడు వైట్, బ్లాక్ ధరించకూడదు పెళ్లిలో పెళ్లికూతురు మాత్రమే వైట్ ధరించాలి. మీరు కూడా వైట్ వేసుకుని వెళ్తే, పెళ్లికూతురుతో పోటీ పడుతున్నారని అనుకుంటారు. అలాగే నలుపు రంగు కూడా వేసుకోకూడదు.