ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే 2023: ఒలింపిక్ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
ఒలింపిక్ క్రీడలు నాలుగేళ్ళకు ఒకసారి జరుగుతాయి. ఒలింపిక్ క్రీడలకు ప్రపంచ దేశాల్లో 200దేశాల నుండి క్రీడాకార్లు వస్తారు. 400రకాల క్రీడల్లో పోటీ ఉంటుంది.
అయితే ప్రతీ ఏడాది జూన్ 23వ తేదీన అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవాన్ని జరుపుతారు. ఒలింపిక్ క్రీడల స్ఫూర్తిని ప్రపంచమంతా చేర్చాలనే ఉద్దేశ్యంతో ఈ రోజును జరుపుకుంటారు.
1894లో సోర్బోర్న్ నగరం పారిస్ లో ఇంటర్నేషన్ ఒలింపిక్ కమిటీ ప్రారంభ తేదీ(జూన్ 23) రోజునే ఒలింపిక్ డేని నిర్వహిస్తున్నారు. 1948లో మొదటిసారిగా ఒలింపిక్ డేని నేషనల్ ఒలింపిక్ కమిటీ నిర్వహించింది.
ఈరోజున ప్రపంచంలో ఉన్న ప్రతీ ఒక్కరి చూపును క్రీడల వైపు చూసేలా అనేక కార్యక్రమాలు జరుపుతారు.
Details
శారీరక, మానసిక ఆరోగ్యాన్ని అందించేందుకే క్రీడలు
ఈ సంవత్సరం, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ కలిసి ప్రజలను క్రీడల్లో ప్రోత్సహించేందుకు, శారీరక శ్రమ చేసేందుకు కొన్ని కార్యక్రమాలను రూపొందించింది.
దీని ప్రకారం, అంతర్జాతీయ ఒలింపిక్ డే రోజున ప్రతీ ఒక్కరూ 30నిమిషాల పాటు వర్కౌట్స్ చేయాలని సూచించింది. దానివల్ల శారీకంగానే కాదు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు.
శరీరం, మనస్సు ఆరోగ్యంగా ఉండటానికి చేయాల్సిన కనీస శ్రమ కూడా ప్రస్తుత తరం చేయట్లేదు. ఆ పరిస్థితిని మార్చడానికే ఒలింపిక్ డే ని నిర్వహిస్తున్నట్లు ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ప్రయత్నం చేస్తుంది.
క్రీడల వల్ల మెదడు చురుగ్గా మారుతుంది. టీమ్ వర్క్ చేసే లక్షణాన్ని క్రీడలు పెంచుతాయి.