బాసింపట్టు వేసుకుని కూర్చోవడం వల్ల ప్రెగ్నెన్సీ మహిళలకు ఇబ్బంది కలుగుతుందా?
గర్భం ధరించిన తర్వాత మహిళలు తమ అరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. కడుపులో బిడ్డ ఆరోగ్యం మీద దృష్టి పెట్టి తమ ఆరోగ్యాన్ని కుదురుగా ఉంచుకోవాలి. సాధారణంగా ఈ సమయంలో శరీరంలో చాలా మార్పులు వస్తుంటాయి. ఆ మార్పులను గమనించుకుని అందుకు తగిన విధంగా జాగ్రత్తలు పాటించాలి. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన మొదటి వారాల్లో మరింత జాగ్రత్త అవసరం ఉంటుంది. కూర్చునే విధానం నుండి, నడక వేగం వరకూ అన్నింట్లోనూ జాగ్రత్త తీసుకోవాలి. చాలామంది గర్భం ధరించిన మహిళలకు ఒక సందేహం ఉంటుంది. ప్రెగ్నెన్సీ టైమ్ లో బాసింపట్టు వేసుకుని కూర్చోవచ్చా లేదా అని అనుమానం కలుగుతుంది. ప్రెగ్నెన్సీ టైమ్ లో బాసింపట్టు వేసుకుని కూర్చోవచ్చు. దానికి కొన్ని లిమిట్స్ ఉన్నాయి.
బాసింపట్టు వేసుకునేటపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
బాసింపట్టు వేసుకున్నప్పుడు గర్భాశయం మీద ఒత్తిడి పడకుండా చూసుకోవాలి. ఒత్తిడి అనిపిస్తే కూర్చోకూడదు. బాసింపట్టు వేసుకుని కూర్చునే అలవాటు లేని వాళ్ళు ప్రెగ్నెన్సీ టైమ్ లోప్రయత్నించవద్దు. బాసింపట్టు వేసుకుని కూర్చుంటే నడుము కింది భాగంలోని ఎముకలకు బలం చేకూరుతుంది. రెండు కాళ్ళు ఒకదాని మీద విశ్రాంతి తీసుకుంటూ నడుము కింద భాగం మీద బరువు పడుతుంది కాబట్టి ఇది మేలు చేస్తుంది. కానీ ముందే చెప్పినట్టు గర్భాశయం మీద ఎఫెక్ట్ పడకపోతే మాత్రమే దీన్ని ట్రై చేయొచ్చు. అలాగే ఎవరైతే నడుము నొప్పితో బాధపడే ప్రెగ్నెన్సీ మహిళలు ఉంటారో వాళ్ళు బాసింపట్లు వేసుకుని కూర్చోకూడదు. కాబట్టి మీ శరీర తత్వాన్ని, బిహేవియర్ ని బట్టి మీరు బాసింపట్టు వేసుకుని కూర్చోవచ్చు.