అ నగరంలో చనిపోవడం చట్ట విరుద్ధం : 70సంవత్సరాల్లో ఒక్కరు కూడా మరణించని నగరం గురించి తెలుసుకోండి
పుట్టిన ప్రతీ జీవి చనిపోవాల్సిందే. మనుషులైనా, జంతువులైనా ఈ భూమి మీదకు కేవలం అతిథులుగా వచ్చిన వాళ్ళే. కొన్ని రోజుల్లు ఇక్కడ జీవించి మళ్లీ మరణించాల్సిందే. మరణం అంటే మనిషికి చాలా భయం. ఎందుకంటే ఆ తర్వాత ఏముంటుందనేది ఎవరికీ తెలియదు. మరణాన్ని జయించాలని చూస్తున్న వాళ్లు చాలామంది ఉన్నారు. వాళ్ల గురించి పక్కన పెడితే, ప్రస్తుతం చెప్పుకోబోయే ఒక నగరంలో 70సంవత్సరాలు నుంచి ఒక్కరు కూడా చనిపోలేదు. అవును మీరు విన్నది నిజమే, గడచిన 70 సంవత్సరాల్లో ఆ నగరంలో ఒక్క మనిషి కూడా చనిపోలేదు. దానికి కారణం ఆ నగర పరిస్థితులు. నార్వే లోని లాంగ్ ఇయర్ బైన్ నగరంలో చనిపోవడం చట్ట విరుద్ధం.
మంచు కారణంగా చనిపోవడం చట్ట విరుద్ధం
చనిపోవడం చట్ట విరుద్ధమనేది చాలా విచిత్రంగా ఉంది కదూ.. నిజమే, అయితే దానికి కారణం ఉంది. లాంగ్ ఇయర్ బైన్ నగరం చల్లగా ఉంటుందని ఇంతకు ముందే చెప్పుకున్నాం. ఈ ప్రాంతంలో మంచు కురుస్తూ ఉండడం వల్ల శీతలంగా ఉంటుంది. గతంలో ఈ ప్రాంతంలో చనిపోయిన వారిని మంచులో పూడ్చిపెట్టారు. కానీ మంచు కారణంగా శవం కుళ్ళిపోలేదు. దాంతో శవంలోని బ్యాక్టీరియా బ్రతికి ఉండడం వల్ల ఆ నగరంలో రోగాలు వ్యాపించాయి. ఈ కారణంగా అప్పటినుండి ఈ నగరంలో చనిపోవడాన్ని నిషేధించారు. ఎవరైనా చనిపోయే స్థితిలో ఉంటే వారిని హెలికాప్టర్ లో వేరే నగరానికి తీసుకెళ్లి అక్కడే అంత్యక్రియలను పూర్తి చేస్తారు. ఈ నగర జనాభా 2వేల మంది కాబట్టి ఇదంతా సాధ్యమవుతుంది.