Loading...
Jantar Mantar: ఇండియా బినాలే 2026 వేదికల్లో ఢిల్లీలోని జంతర్ మంతర్‌కు చోటు
ఇండియా బినాలే 2026 వేదికల్లో ఢిల్లీలోని జంతర్ మంతర్‌కు చోటు

Jantar Mantar: ఇండియా బినాలే 2026 వేదికల్లో ఢిల్లీలోని జంతర్ మంతర్‌కు చోటు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 29, 2026
10:57 am

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీలోని జంతర్ మంతర్‌కు అరుదైన గుర్తింపు లభించింది. ఇండియా బినాలే 2026 వేడుకలు నిర్వహించనున్న వేదికల్లో దీనికి చోటు దక్కింది. ఈ నెల ప్రారంభంలో జంతర్ మంతర్‌ను నిరసనలకు కేటాయించిన ప్రాంతాల జాబితా నుంచి తొలగించారు. డిసెంబర్ 4న ప్రారంభం కానున్న ఇండియా బినాలే ఉత్సవాలు వచ్చే ఏడాది మార్చి 21 వరకు కొనసాగనున్నాయి. బినాలే అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఈ కార్యక్రమం రెండో ఎడిషన్‌కు 'తత్ త్వమ్ అసి' (Tat Tvam Asi) అనే భావనను శీర్షికగా తీసుకున్నారు. దీనికి 'నువ్వే అది' లేదా 'నీవే ఆ పరమ సత్యం' అని అర్థం. ప్రపంచాన్ని చూసే వ్యక్తి, ఆ ప్రపంచం వేర్వేరు కాదనే ఉపనిషత్తుల భావనను ఇది తెలియజేస్తుంది.

వివరాలు 

రెండో ఎడిషన్‌ను పెద్ద స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు

2023లో తొలిసారిగా ఇండియా ఆర్ట్, ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్ బినాలేను ఢిల్లీలోని ఎర్రకోటలో నిర్వహించారు.

ఇప్పుడు రెండో ఎడిషన్‌ను మరింత పెద్ద స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఢిల్లీలోని చారిత్రక కట్టడాలు, ప్రముఖ ప్రాంతాలను ప్రదర్శనలు, ప్రత్యేక అనుభవాలు, కళా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాల వేదికలుగా ఎంపిక చేశారు.

ఈ జాబితాలో పురానా ఖిలా, ఎర్రకోట, కుతుబ్ మినార్, అగ్రసేన్ కీ బావోలి, హుమాయూన్ సమాధి, సఫ్దర్‌జంగ్ సమాధి, సబ్జ్ బుర్జ్, జాతీయ మ్యూజియం, లోధీ గార్డెన్, సక్రీ ఘుమ్టీ, ఛోటీ ఘుమ్టీ తదితర ప్రాంతాలు ఉన్నాయి.

అయితే, ప్రస్తుతం బినాలే అధికారిక వెబ్‌సైట్‌లో జంతర్ మంతర్ పేరు కనిపించడం లేదు. త్వరలోనే ఈ జాబితాలో దాన్ని చేర్చనున్నట్లు సమాచారం.

వివరాలు 

కుతుబ్ మినార్ వద్ద 'వారణాసి ది టైమ్‌లెస్' ప్రదర్శన ఏర్పాటు

ఇండియా బినాలే 2026లో భాగంగా పలు ప్రత్యేక ప్రదర్శనలను నిర్వహించనున్నారు.

పురానా ఖిలాలో బిహార్ మ్యూజియం ఎగ్జిబిషన్, ఎర్రకోటలో 'అరుగు: ఎ కామన్స్ ఫర్ ప్లే' కార్యక్రమాలు జరగనున్నాయి.

పరేశ్ మైతి, రీతూ బేరీ రూపొందించిన 'వారణాసి ది టైమ్‌లెస్' ప్రదర్శన కుతుబ్ మినార్ వద్ద ఏర్పాటు చేయనున్నారు.

అలాగే, ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్‌లో 'అంతర్ యాత్ర: ఎ జర్నీ బ్యాక్ ఇంటూ ది వూమ్ ఆఫ్ కాన్షస్‌నెస్' పేరుతో మరో ప్రదర్శన నిర్వహించనున్నారు.

వీటితో పాటు మరికొన్ని కళా కార్యక్రమాలు కూడా ఈ ఉత్సవాల్లో భాగం కానున్నాయి.

ADVERTISEMENT

వివరాలు 

నిరసనల వేదికగా మారకముందు జంతర్ మంతర్ ప్రత్యేకత ఇదీ!

దేశవ్యాప్తంగా జంతర్ మంతర్ అంటే నిరసనలు, ఆందోళనలు గుర్తుకు వస్తాయి.

తమ సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయడానికి ప్రజలు ఇక్కడికి వస్తుంటారు.

అయితే, ఈ ప్రాంతానికి అంతకంటే సుదీర్ఘమైన చరిత్ర ఉంది.

1724లో జైపూర్ మహారాజు రెండో జైసింగ్‌ దీనిని నిర్మించారు. ఖగోళ శాస్త్రంపై ఆసక్తి ఉన్న ఆయన ఉత్తర భారతదేశంలో ఢిల్లీ, జైపూర్,ఉజ్జయిని,వారణాసి,మథురలో ఐదు ఖగోళ పరిశీలనా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షా పాలనలో ఢిల్లీలోని జంతర్ మంతర్ నిర్మాణం జరిగింది.

ఆ రోజుల్లో ఆకాశంలోని గ్రహాలు, నక్షత్రాల కదలికలను గమనించేందుకు చిన్న ఇత్తడి పరికరాలను ఉపయోగించేవారు.

అయితే, వాటి పనితీరుపై సంతృప్తి చెందని జైసింగ్‌ పెద్ద పెద్ద నిర్మాణాలను ఉపయోగించి ఖగోళ పరిశీలనా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ADVERTISEMENT

వివరాలు 

నిరసనల వేదికగా మారకముందు జంతర్ మంతర్ ప్రత్యేకత ఇదీ!

ఇందులోని 'సమ్రాట్ యంత్రం' అనే భారీ సూర్యగడియారం ద్వారా కొన్ని సెకన్ల తేడాతో సమయాన్ని తెలుసుకోవచ్చు.

ఇతర నిర్మాణాల సాయంతో సూర్యుడు, చంద్రుడు, గ్రహాల కదలికలు, నక్షత్రాల స్థానాలను పరిశీలించవచ్చు.

జంతర్ మంతర్‌లోని నిర్మాణాలు శాస్త్ర విజ్ఞానంతో పాటు వాస్తుశిల్ప నైపుణ్యానికీ నిదర్శనంగా నిలుస్తాయి.

మెట్లు, వంపులు, గోడలతో కూడిన ఈ నిర్మాణాలపై రోజంతా సూర్యకాంతిని బట్టి నీడలు మారుతూ ఉంటాయి.

పార్లమెంటుకు సమీపంలో ఉండటంతో జంతర్ మంతర్ క్రమంగా నిరసనలకు కేంద్రంగా మారింది.

దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు, ఆందోళనకారులు, నిరాహార దీక్షలు చేపట్టేవారు, పలు సంఘాల ప్రతినిధులు తమ సమస్యలను ఇక్కడ వినిపించేవారు.

పార్లమెంటు సమీపంలోనే తమ గళాన్ని ప్రభుత్వానికి వినిపించే వేదికగా ఇది గుర్తింపు పొందింది.

ADVERTISEMENT