LOADING...
Kailash Mansarovar Yatra: ఐదేళ్ల తర్వాత కైలాష్ మానసరోవర్ యాత్ర..మార్గదర్శకాలు ఇవే..
ఐదేళ్ల తర్వాత కైలాష్ మానసరోవర్ యాత్ర..మార్గదర్శకాలు ఇవే

Kailash Mansarovar Yatra: ఐదేళ్ల తర్వాత కైలాష్ మానసరోవర్ యాత్ర..మార్గదర్శకాలు ఇవే..

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 02, 2025
12:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

కైలాస మానస సరోవర యాత్ర అనేది హిందూ మతంతో పాటు బౌద్ధ,జైన, బోన్ మతాల వారికీ పవిత్రమైన యాత్రగా చెప్పవచ్చు. ఇది అనేక మతాల భక్తులను ఆకర్షించే పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రయాణం. ఈ యాత్ర ద్వారా యాత్రికులు టిబెట్ లోని కైలాస పర్వతం,మానస సరోవర సరస్సు వద్దకు చేరుకొని, ప్రకృతి దృశ్యాలతో కూడిన హిమాలయ పరిసరాలలో ఆధ్యాత్మికతను అనుభవిస్తారు. 2017లో డోక్లాం సంఘటన కారణంగా,అలాగే COVID-19 మహమ్మారి కారణంగా ఈ యాత్ర ఐదు సంవత్సరాలపాటు నిలిపివేసారు. ఇప్పుడు 2025 జూన్ 30న సిక్కిం రాష్ట్రంలో తిరిగి ప్రారంభం కానుంది. ఈ యాత్ర సుమారు 22రోజులు సాగనుంది. సిక్కిం రాజధాని గ్యాంగ్‌టాక్ లోని ఇండో-చైనా సరిహద్దు నుంచి యాత్రికులు ఈ పవిత్ర యాత్రను ప్రారంభిస్తారు.

వివరాలు 

రెండు కేంద్రాలు ఏర్పాటు

యాత్రికులు మానస సరోవర సరస్సు, కైలాస పర్వతం వద్దకు చేరుకుని, ఆ పవిత్ర పర్వతం చుట్టూ పరిక్రమ (సర్కమ్) చేస్తారు. ఈ ప్రయాణంలో 16వ మైలు ప్రాంతంలో (సుమారు 10,000 అడుగులు ఎత్తులో) హంగు సరస్సు సమీపంలో (సుమారు 14,000 అడుగుల ఎత్తులో) రెండు కేంద్రాలు ఏర్పాటుచేస్తారు. ఈ కేంద్రాలు యాత్రికులకు వసతి, ఆరోగ్య సంరక్షణ, ముఖ్యంగా ఎత్తైన ప్రాంతాలలో సౌకర్యాలు అవసరమైన సామగ్రి అందించడానికి సహాయపడతాయి, యాత్ర సజావుగా, భద్రతగా సాగేందుకు అధికారులు రోడ్డు నిర్వహణ, భద్రతా చర్యలను మరింత బలోపేతం చేశారు. సిక్కిం లోని నాథులా మార్గం మంచి రోడ్లు, ప్రశాంతమైన పరిసరాలు కలిగి ఉండటంతో, అత్యంత సురక్షితమైన, సౌకర్యవంతమైన మార్గంగా పరిగణించబడుతుంది.

వివరాలు 

వాతావరణ పరిస్థితులకు తగిన విధంగా శారీరకంగా సిద్దం కావాలి

ఈ యాత్రకు వెళ్లదలచిన వారు విదేశాంగ మంత్రిత్వ శాఖలో తప్పనిసరిగా నమోదు కావాలి. ఎత్తైన ప్రాంతాల వాతావరణం, వాతావరణ పరిస్థితులకు తగిన విధంగా శారీరకంగా సిద్దం కావాలి. యాత్ర సమయంలో చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రాలు, పర్మిట్లు, ఇతర అవసరమైన పత్రాలు తప్పకుండా తీసుకెళ్ళాలి. ఈ విధంగా ప్రభుత్వం ఈ పవిత్ర యాత్ర కోసం నిర్దేశించిన మార్గదర్శకాలు జారీ చేసి, యాత్రికుల భద్రత, సౌకర్యాలను కాపాడుతోంది.