నోరూరించే పాప్ కార్న్ వెరైటీలను ఇలా తయారు చేసుకోండి
పాప్ కార్న్ అంటే మీకిష్టం అయితే ఈ రోజు ఇంట్లో తయారు చేసుకోగలిగే పాప్ కార్న్ వెరైటీల గురించి తెలుసుకుందాం. నిమ్మ, మిరియాలతో పాప్ కార్న్: మైక్రోవేవ్ ఓవెన్ లో పాప్ కార్న్ రెడీ కాగానే ఒక పాత్రలోకి మార్చుకోవాలి. మరో పాత్రలో నల్లమిరియాలు, నిమ్మతొక్కల పొడి, మామిడి పొడి(ఆమ్ చూర్) వేసి బాగా కలపాలి. ఆ తర్వాత దీంట్లో పాప్ కార్న్ వేసి బాగా కార్న్ గింజలకు పొడి మొత్తం అతుక్కునేలా ఎగరవేయండి. టోఫీ పాప్ కార్న్: మైక్రోవేవ్ లోంచి పాప్ కార్న్ పక్కన పెట్టుకోవాలి. మరో పాత్రలో వెన్న, చక్కెర, ఉప్పు వేసి చక్కెర కరిగిపోయేంత వరకు మరిగించాలి. తర్వాత ఈ పాత్రలో పాప్ కార్న్ వేసి బాగా వేయించాలి.
దాల్చిన చెక్క, ఆవాలతో తయారయ్యే పాప్ కార్న్ వెరైటీలు
తేనె పాప్ కార్న్: ఒక పాత్రలో ఆనియన్ పౌడర్, ఉప్పు కలిపి పక్కన పెట్టుకోవాలి. మరో పాత్రలో ఆవాలు, వెనిగర్, తేనె వేసి బాగా కలపాలి. ఇంకో పాత్ర తీసుకుని కొబ్బరి నూనెలో పాప్ కార్న్ వేయించాలి. కార్న్ రెడీ అవగానే ఆవాల మిశ్రమంలో వేయాలి. ఆ తర్వాత ఆనియర్ పౌడర్, ఉప్పును జల్లాలి. దాల్చిన చెక్క పాప్ కార్న్: తినే పదార్థమైన బ్రౌన్ షుగర్ ని నీళ్ళలో మరిగించాలి. చాక్లెట్ కలర్ లోకి నీళ్ళు మారగానే వెన్నను ఇందులో కలపాలి. మిశ్రమం తయారయ్యాక దాల్చిన చెక్కను అందులో వేసి స్టవ్ మీద నుండి దించాలి. పాప్ కార్న్ ప్రిపేర్ చేసుకుని వాటిని మిశ్రమంలో కలపాలి.