Loading...
Laid Off From HP: 30 ఏళ్ల సర్వీస్‌ తర్వాత లేఆఫ్‌.. 59ఏళ్ల వయసులో అంటార్కిటికాలో కొత్త ఉద్యోగం పొందిన మహిళ
59ఏళ్ల వయసులో అంటార్కిటికాలో కొత్త ఉద్యోగం పొందిన మహిళ

Laid Off From HP: 30 ఏళ్ల సర్వీస్‌ తర్వాత లేఆఫ్‌.. 59ఏళ్ల వయసులో అంటార్కిటికాలో కొత్త ఉద్యోగం పొందిన మహిళ

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 18, 2026
11:43 am

ఈ వార్తాకథనం ఏంటి

59 ఏళ్ల వయసులో.. అదీ మూడు దశాబ్దాల పాటు పనిచేసిన సంస్థలో ఉద్యోగం కోల్పోతే ఎవరైనా కుంగిపోతారు. కానీ, మే లీ మాత్రం ఆ పరిస్థితిని ఓ సరికొత్త సాహసానికి అవకాశంగా మార్చుకున్నారు. టెక్ దిగ్గజం హెచ్‌పీ (హ్యూలెట్‌-ప్యాకర్డ్‌)లో 30 ఏళ్ల కెరీర్‌ ముగిసిన తర్వాత.. ఏకంగా అంటార్కిటికాలో ఉద్యోగం సంపాదించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

వివస్ర్తాలు 

హెచ్‌పీలో ఇంటర్న్‌గా మొదలై.. ఉన్నత స్థాయికి

మే లీ 1987లో హెచ్‌పీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌ ఇంటర్న్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు.

అనంతరం అదే సంస్థలో మార్కెటింగ్‌ విభాగంలో ఉన్నత స్థాయికి ఎదిగారు.

అక్కడే పదవీ విరమణ చేయాలని భావిస్తున్న సమయంలో.. 2025 ఫిబ్రవరిలో లేఆఫ్‌ కారణంగా ఉద్యోగాన్ని కోల్పోయారు.

ఆ తర్వాత కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించినప్పటికీ ఆశించిన ఫలితాలు రాలేదు.

దీంతో తనకు ఎంతో ఇష్టమైన అంటార్కిటికాలో ఉద్యోగ అవకాశాలను అన్వేషించడం ప్రారంభించారు.

గతంలో రెండుసార్లు పర్యాటకురాలిగా ఆ ప్రాంతాన్ని సందర్శించిన అనుభవం.. ఈ నిర్ణయం తీసుకోవడంలో ఆమెకు ప్రేరణగా నిలిచింది.

వివరాలు 

ఫోర్క్‌లిఫ్ట్‌ నడుపుతూ.. సరుకుల నిర్వహణ

కఠినమైన ఎంపిక ప్రక్రియ, శారీరక సామర్థ్య పరీక్షలను పూర్తి చేసిన అనంతరం.. యూఎస్‌ అంటార్కిటిక్‌ ప్రోగ్రామ్‌కు సేవలందించే అమెంటమ్‌ అనే కాంట్రాక్టర్‌ సంస్థలో సప్లై టెక్నీషియన్‌గా మే లీ ఉద్యోగం సంపాదించారు.

గతంలో ఎక్కువగా డెస్క్‌ ముందు కూర్చొని పనిచేసిన ఆమె.. ఇప్పుడు మెక్‌మర్డో స్టేషన్‌లోని ఐటీ వేర్‌హౌస్‌లో ఫోర్క్‌లిఫ్ట్‌ నడపడం, సరుకులను తరలించడం వంటి శారీరక శ్రమతో కూడిన విధులు నిర్వహిస్తున్నారు.

ఈ ఉద్యోగంలో జీతం తక్కువగానే ఉన్నప్పటికీ.. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుండటంతో ఈ అవకాశాన్ని ఆమె సంతోషంగా స్వీకరించారు.

ADVERTISEMENT

వివరాలు 

కాలేజీ పట్టణాన్ని తలపించే మెక్‌మర్డో స్టేషన్

మెక్‌మర్డో స్టేషన్‌లోని వాతావరణం ఓ కాలేజీ పట్టణాన్ని తలపిస్తుందని మే లీ తెలిపారు.

అక్కడ పనిచేసే సిబ్బంది మధ్య బలమైన స్నేహబంధం ఉంటుందని వివరించారు.

త్వరలో ప్రారంభం కానున్న కొత్త సీజన్‌లో.. బ్రాడ్‌కాస్ట్‌ ఇంజినీర్‌గా మరో కొత్త బాధ్యతను చేపట్టేందుకు ఆమె సిద్ధమవుతున్నారు.

అనుకోకుండా ఎదురైన ఉద్యోగ నష్టాన్ని నిరాశగా మిగలనివ్వకుండా.. జీవితంలో మరపురాని సాహసయాత్రగా మలచుకున్న మే లీ కథ ఎంతోమందికి స్ఫూర్తినిస్తోంది.

ADVERTISEMENT