
Potato Cutlets: బంగాళాదుంప కట్‌లెట్స్ ని క్రిస్పీగా.. ఇలా సులభంగా తయారు చేసుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
బంగాళాదుంపలతో ఎన్నో రకాల నోటికి రుచికరమైన స్నాక్స్ తయారు చేయవచ్చు. చిన్నాపెద్దలకూ ఇవి బాగా నచ్చుతాయి.
బంగాళాదుంపలతో తయారయ్యే కట్‌లెట్స్ ఓ స్పెషల్ వంటకం.
ఈ వంటకానికి బీట్‌రూట్, క్యారెట్, కొత్తిమీర వంటి పదార్థాలు కూడా జత చేయడం వల్ల మంచి రుచితో పాటు ఆకర్షణీయమైన వాసన కూడా వస్తుంది.
ఈ పొటాటో కట్లెట్లను తింటే క్రిస్పీగా ఉంటాయి.
ఈ కట్‌లెట్స్ తయారీ విధానం చాలా ఈజీ. వాటిని స్టవ్ మీద నూనెలో వేయించవచ్చు లేదా ఓవెన్, ఎయిర్‌ఫ్రైయర్‌లో కూడా సులభంగా వండవచ్చు.
వివరాలు
కావాల్సిన పదార్థాలు:
బంగాళాదుంపలు - 5
తురిమిన బీట్‌రూట్ - 1 స్పూన్
ఉప్పు - తగినంత
మిరియాల పొడి - ¼ స్పూన్
కారం - 1 స్పూన్
తురిమిన కొత్తిమీర - 3 స్పూన్లు
తురిమిన పచ్చిమిర్చి - 1 స్పూన్
బ్రెడ్ ముక్కలు - 2
నూనె - 3 స్పూన్లు (వేయించడానికి కావలసినంత)
తురిమిన చీజ్ - 3 స్పూన్లు
మైదా - 2 స్పూన్లు
వివరాలు
తయారీ విధానం:
మొదట బంగాళాదుంపలను నీటిలో వేసి బాగా ఉడికించాలి. తరువాత వాటి తొక్కలు తీసి,ప్లేటులో వేసుకుని చేత్తో మెత్తగా మెదుపుకోవాలి.
ఇప్పుడు ఒక గిన్నెలో ఉడికిన బంగాళాదుంప ముద్దను వేసి, అందులో తగినంత ఉప్పు, కారం, తురిమిన బీట్‌రూట్, క్యారెట్, కొత్తిమీర వేసి బాగా కలపాలి.
ఈ మిశ్రమం నుండి చిన్న చిన్న ముద్దలు తీసుకుని చేత్తో గుండ్రంగా వత్తాలి.
మధ్యలో కొంచెం స్థలం చేసి, అందులో తురిమిన చీజ్ ఉంచి మళ్లీ కట్‌లెట్ ఆకారంలో వత్తాలి.
ఇలా అన్నీ తయారుచేసి పక్కన పెట్టుకోవాలి. మరో గిన్నెలో మైదా, కొద్దిగా నీరు వేసి మెత్తగా కలిపి మిశ్రమం తయారుచేయాలి.
వివరాలు
టొమాటో కెచప్‌తో తింటే అదిరిపోయే టేస్ట్
బ్రెడ్ ముక్కలను మిక్సీతో పొడి చేసి, ఒక ప్లేటులో వేసుకోవాలి. ప్రతి కట్‌లెట్‌ను మైదా నీటి మిశ్రమంలో ముంచి, తరువాత బ్రెడ్ క్రంబ్స్‌లో చుట్టాలి.
ఇప్పుడు బాణలిలో నూనె వేడి చేసి, అందులో కట్‌లెట్లు వేసి రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
ఇవి గ్రీన్ చట్నీ లేదా టొమాటో కెచప్‌తో తింటే అదిరిపోయే టేస్ట్ వస్తుంది.
మీ పిల్లలకు లేదా కుటుంబ సభ్యులకు రుచికరమైన స్నాక్స్ తయారు చేయాలనుకుంటే, ఈ బంగాళాదుంప కట్‌లెట్లు తప్పకుండా ప్రయత్నించండి.
చిన్నవాళ్లే కాదు, పెద్దవాళ్లకూ ఇది ఎంతో ఇష్టంగా అనిపిస్తుంది!