NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / లక్నో, కోల్ కతా బిర్యానీల కంటే చెన్నై దిండిగల్ బిర్యానీ బాగుందంటూ ట్వీట్ వార్ కి తెరలేపిన నెటిజన్
    తదుపరి వార్తా కథనం
    లక్నో, కోల్ కతా బిర్యానీల కంటే చెన్నై దిండిగల్ బిర్యానీ బాగుందంటూ ట్వీట్ వార్ కి తెరలేపిన నెటిజన్
    బిర్యానీ గురించి ట్విట్టర్ వార్

    లక్నో, కోల్ కతా బిర్యానీల కంటే చెన్నై దిండిగల్ బిర్యానీ బాగుందంటూ ట్వీట్ వార్ కి తెరలేపిన నెటిజన్

    వ్రాసిన వారు Sriram Pranateja
    Mar 09, 2023
    06:28 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఏ ప్రాంత ప్రజలకైనా అక్కడి ఆహారాలు కూడా వాళ్ళ సంస్కృతిలో ఒక భాగంగా ఉంటాయి. అలా బిర్యానీని కూడా తమ సంస్కృతిలో భాగంగా చూసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు.

    ఇప్పుడు వాళ్ళందరితో చర్చకు దిగాడు యూనస్ లాసనియా అనే పర్సన్.

    ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిన యూనస్, తనకు హైదరాబాద్ బిర్యానీ అంటే ఇష్టమని చెబుతూనే, చెన్నై లోని దిండిగల్ బిర్యానీ బాగుందనీ, లక్నో, కోల్ కతా బిర్యానీల కంటే అద్భుతంగా ఉందనీ అన్నాడు.

    అంతే, ఒక్కసారిగా నెటిజన్లు అందరూ యూనస్ ట్వీట్ కి స్పందించారు.

    బిర్యానీ అంటే హైదరాబాద్ బిర్యానీ మాత్రమేనని, మిగతావన్నీ పులావ్ లనీ ఒక నెటిజన్ అనడంతో, యూనస్ సమాధానమిస్తూ హైదరాబాద్ బిర్యానీ కూడా పులావేనని అన్నాడు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    బిర్యానీ గురించి యుద్ధం, ట్విట్టర్ లో వార్

    Unpopular hot take on biryani (NOTE: HYD biryani is still my FAV):#Chennai 's Dindigul biryani is absolutely amazing. Loved it, and Imho it's better than Lucknow and Calcutta biryani. Very flavourful.

    This us from Erode Annam mess.Don't come at me with 'no layers' argument 😂 pic.twitter.com/OJ6J5Li5AX

    — Yunus Lasania (@YunusLasania) March 8, 2023

    బిర్యానీ

    లక్నో, కోల్ కతా, చెన్నై దిండిగల్ బిర్యానీల ప్రత్యేకత

    మరికొందరేమో, అసలు బిర్యానీ అంటే బాస్మతి బియ్యంతో చేస్తారనీ, బాస్మతి బియ్యంతో చేయనిది బిర్యానీ కాదనీ అన్నారు. ఇంకొందరేమో, యూనస్ కి మద్దతుగా, దిండిగల్ బిర్యానీ బాగుంటుందనీ అన్నారు.

    అయితే లక్నో, కోల్ కతా, దిండిగల్ బిర్యానీల మధ్య తేడా

    లక్నో బిర్యానీ :

    పర్షియన్ స్టైల్ కుకింగ్ లో వండే ఈ బిర్యానీని చిన్నమంట మీద చాలాసేపు వండుతారు.

    కోల్ కతా బిర్యానీ:

    ఈ బిర్యానీ కొంచెం తియ్యగా ఉంటుంది. మొఘల్ వంటకాల స్ఫూర్తితో ఉండే ఈ బిర్యానీలో బంగాళ దుంపలు అధికంగా ఉంటాయి.

    దిండిగల్ బిర్యానీ:

    దక్షిణాది రాష్ట్రాల వంటకాల మాదిరిగా ఉండే ఈ బిర్యానీని బాస్మతి బియ్యంతో కాకుండా జీరా సాంబ రైస్ తో తయారు చేస్తారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆహారం

    తాజా

    Starlink Kit: స్టార్‌లింక్‌ సర్వీస్‌కు ముందు భారీ ఖర్చు.. కిట్ ధర ఎంతంటే? స్టార్‌లింక్‌
    Sundar Pichai: గూగుల్ తర్వాత సీఈఓ ఎవరు? సుందర్ పిచాయ్ ఏం చెప్పారంటే? గూగుల్
    Maganti Gopinath : జూబ్లీహిల్స్ గోపినాథ్ కన్నుమూత.. నిర్మాతగా ఆయన తీసిన సినిమాలివే! జూబ్లీహిల్స్
    Telangana Cabinet: తెలంగాణ కేబినెట్‌ విస్తరణ.. ముగ్గురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం తెలంగాణ

    ఆహారం

    నోరూరించే పాప్ కార్న్ వెరైటీలను ఇలా తయారు చేసుకోండి వంటగది
    బరువు తగ్గడం: పొట్టకొవ్వు పెరుగుతుంటే ఈ పండ్లను మీ ఆహారంలో చేర్చుకోండి బరువు తగ్గడం
    మెదడు పనితీరును దెబ్బ తీసి మతిమరుపును తీసుకొచ్చే ఆహారాలు లైఫ్-స్టైల్
    ఒత్తిడిని దూరం చేయడం నుండి సంతాన ప్రాప్తి వరకు శిలాజిత్ వల్ల కలిగే ప్రయోజనాలు లైఫ్-స్టైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025