LOADING...
Raw Mango Juice: మామిడికాయ చల్లని డ్రింక్.. వేసవిలో ఒక్కసారైనా ట్రై చేయాల్సిందే!
మామిడికాయ చల్లని డ్రింక్.. వేసవిలో ఒక్కసారైనా ట్రై చేయాల్సిందే!

Raw Mango Juice: మామిడికాయ చల్లని డ్రింక్.. వేసవిలో ఒక్కసారైనా ట్రై చేయాల్సిందే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 06, 2026
11:46 am

ఈ వార్తాకథనం ఏంటి

సమ్మర్ సీజన్‌లో మామిడికాయలు విరివిగా లభించే సమయంలో, వాటితో ఎన్నో రకాల వంటకాలు చేస్తుంటారు. అలాంటి వారికోసం మండుటెండల్లో చల్లని ఉపశమనం ఇచ్చే ఒక అద్భుతమైన డ్రింక్ రెసిపీ ఇక్కడ ఉంది. మామిడిపండ్ల జ్యూస్ కంటే కూడా ఇది మరింత రుచిగా ఉంటుంది. ముఖ్యంగా ఈ మ్యాంగో మిక్స్‌ను ఒక్కసారి తయారు చేసుకుంటే 20 రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. అవసరమైనప్పుడు వెంటనే డ్రింక్‌గా తయారు చేసుకోవచ్చు.

వివరాలు

కావాల్సిన పదార్థాలు

మామిడికాయలు - 4 బెల్లం తురుము - 3 కప్పులు యాలకుల పొడి - 1 టీ స్పూన్ ఐస్ క్యూబ్స్ - కొన్ని

వివరాలు

తయారీ విధానం

ముందుగా మామిడికాయలను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో పెట్టాలి. తరువాత స్టవ్‌పై కుక్కర్‌లో నాలుగు గ్లాసుల నీళ్లు పోసి, అందులో స్టాండ్ ఉంచి, దానిపై మామిడికాయల గిన్నె పెట్టాలి. మూతపెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ప్రెషర్ పూర్తిగా తగ్గిన తర్వాత కుక్కర్ మూత తీసి, మామిడికాయలను బయటకు తీసి కొద్దిసేపు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత టెంక తీసి, గుజ్జును చేతితో బాగా మాష్ చేసుకోవాలి. ఇక మిక్సీ జార్‌లో బెల్లం తురుము వేసి మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్‌గా చేసుకోవాలి. ఈ బెల్లం పేస్ట్‌ను మామిడి గుజ్జులో వేసి బాగా కలపాలి. అందులో యాలకుల పొడి వేసి మరోసారి మిక్స్ చేయాలి.

Advertisement

వివరాలు

తయారీ విధానం1/2

ఇష్టమైతే కొద్దిగా మిరియాల పొడి, ఉప్పు కూడా ఈ దశలో కలుపుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసిన మామిడికాయ మిశ్రమాన్ని ఎయిర్‌టైట్ డబ్బాలో నిల్వ చేసి ఫ్రిజ్‌లో ఉంచితే కనీసం 20 రోజుల పాటు తాజాగా ఉంటుంది. డ్రింక్ తయారు చేయాలనుకున్నప్పుడు గ్లాసులో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి, ఈ మ్యాంగో మిక్స్ నుంచి ఒకటి లేదా రెండు టీ స్పూన్లు వేసి చల్లని నీరు పోసి బాగా కలపాలి. అంతే చల్లచల్లగా, టేస్టీగా ఉండే మామిడికాయ డ్రింక్ రెడీ! ఈ రెసిపీని ఎక్కువ పరిమాణంలో చేయాలనుకుంటే మామిడికాయలు, బెల్లం వంటి పదార్థాలను తగినంతగా పెంచుకుని అదే విధానంలో తయారు చేసుకోవచ్చు.

Advertisement