పానీపూరీలో పానీకి బదులు మామిడి రసం: అవాక్కవుతున్న నెటిజన్లు
ఇండియాలో ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ ఏదైనా ఉందంటే అది పానీపూరీ అని చెప్పవచ్చు. అందరికీ ఇష్టమైన పానీ పూరీని వెరైటీగా అందించాలనే తాపత్రయంతో పానీకి బదులు మామిడి రసాన్ని వాడుతున్నారు. అవును, ప్రస్తుతం మామిడి పండ్ల సీజన్ కాబట్టి అందుకు అనుగుణంగా, మామిడిరసాన్ని పానీపూరీలో అందిస్తున్నారు. ఈ వెరైటీ కాంబేషన్ కు మిశ్రమ స్పందన వస్తోంది. కొందరేమో బాగుందని అంటే, మరికొందరేమో అస్సలు బాలేదని, చెత్తగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం మీద ఇంటర్నెట్ లో పెద్ద చర్చ నడుస్తోంది. ఆహారంతో తయారుచేసే వెరైటీ కాంబినేషన్స్, ఒక్కోసారి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి కాంబినేషన్స్ అన్నీ పాపులారిటీ కోసమే చేస్తారని మరికొంత మంది అంటున్నారు.