కొరియన్ పాప్ మ్యూజిక్ లో స్టార్ గా వెలుగొందుతున్న 20ఏళ్ల ఇండియాకు చెందిన ఆరియా విశేషాలు
ప్రస్తుతం కొరియన్ పాప్ మ్యూజిక్ ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకుంటోంది. కొరియన్ పాపులర్ మ్యూజిక్ గ్రూపుల గురించి ఆన్ లైన్ లో చర్చలు జరుగుతున్నాయి. భారతదేశం నుండి కొయన్ పాప్ మ్యూజిక్ గ్రూపులో చోటు దక్కించుకున్న రెండవ అమ్మాయిగా ఆరియా నిలిచిపోయింది. శ్రియా లెంక తర్వాత కొరియన్ పాప్ మ్యూజిక్ గ్రూప్ లో ప్లేస్ అందుకుంది. 20ఏళ్ల వయసులో X:IN అనే కొరియన్ పాప్ మ్యూజిక్ గ్రూప్ లో చేరింది. ప్రస్తుతం ఆరియా గురించి తెలుసుకందాం. కేరళలోని మళయాలం దంపతులకు జన్మించింది ఆరియా. ఆమె అసలు పేరు గౌతమి. మెల్విలాసమ్ అనే చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించింది ఆరియా.
ఏప్రిల్ 11వ తేదీన మొదటి ప్రదర్శన
2022లో జీబీకే ఎంటర్టైన్మెంట్ ఆర్గనైజేషన్ నిర్వహించిన ఆన్ లైన్ ప్రోగ్రామ్ లో ట్రైనీగా జాయిన్ అయ్యింది. అదే సంవత్సరం నవంబర్ లో జీబీకే తరపున MEP-C గ్రూపులో జాయిన్ అయ్యింది. ఆ తర్వాత 2023మొదట్లో జీబీకే ను వదిలేసింది. 2023 మార్చ్ 7వ తేదీన X:IN గ్రూపులో కొరియన్ పాప్ స్టార్ గా ఐదవ మెంబర్ గా సెలెక్ట్ అయ్యింది. దీంతో ఆరియాపై అభినందనల వర్షం కురిసింది. సోషల్ మీడీయాలో ఆరియా పేరు మారుమోగిపోయింది. మార్చ్ 7వ తేదీన గ్రూప్ లో చేరిన ఆరియా, ఆ తర్వాత ఏప్రిల్ 11వ తేదీన తన గ్రూప్ తో మొదటి ప్రదర్శనను ఇచ్చింది. కీపింగ్ ద్ ఫైర్ అనే డిజిటల్ సింగిల్ తో పర్ఫామెన్స్ ఇచ్చింది.