కూతుర్ల కోసం బట్టలు కుట్టడం నేర్చుకుని, త్రీడీ ప్రింటింగ్ డ్రెస్సులను తయారు చేసిన మార్క్ జుకర్ బర్గ్
ప్రపంచ కుబేరులు సామాన్యుల్లాగా ఉంటారా అన్న అనుమానం చాలామందిలో కలుగుతుంటుంది. సామాన్యులు చేసే పనులు కుబేరులు చేస్తారా అని సందేహం అప్పుడప్పుడు అనిపించడం సహజమే. ప్రస్తుతం మార్క్ జుకర్ బర్గ్ చేసిన పని గురించి వింటే, ఎంత కుబేరులైనా కుటుంబం దగ్గరికి వచ్చేసరికి సామాన్యులే అని అర్థమవుతుంది. ఇంతకీ విషయం ఏంటంటే: ఏప్రిల్ నుండి మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్, కొత్త స్కిల్ నేర్చుకుంటున్నాడు. తన కూతుర్లు అయిన మ్యాక్సిమా, ఆగస్ట్ కోసం బట్టలు కుట్టడం నేర్చుకున్నాడు. ఆ తర్వాత త్రీడీ ప్రింటింగ్ డిజైన్లలో మంచి డ్రెస్సులను తయారు చేసాడు. ఈ విషయాన్ని తన ఇన్స్ టా ఖాతాలో పంచుకున్నాడు మార్క్ జుకర్ బర్గ్.
త్రీడీ ప్రింటింగ్ విశేషాలు
ఇన్స్ టా లో మార్క్ పంచుకున్న ఫోటోలకు మంచి స్పందన వస్తోంది. కొంతమంది నెటిజన్లు, ఈ డ్రెస్సులు, ఈ జ్ఞాపకం తమకు జీవితాంతం గుర్తుండిపోతుందని కామెంట్ చేసారు. మరికొందరేమో త్రీడీ ప్రింటింగ్ ప్రాసెస్ ఏంటని అడగడం మొదలెట్టారు. అదలా ఉంచితే, గతంలో మార్క్ మాట్లాడుతూ, పిల్లలు పుట్టిన తర్వాత జీవితంలో చాలా మార్పులు వస్తాయని అన్నాడు. త్రీడీ ప్రింటింగ్: ఫ్యాషన్ ఇండస్ట్రీలో ప్రస్తుతం త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ ఒక రేంజ్ లో దూసుకుపోతుంది. ఈ టెక్నాలజీ వల్ల సమయం మిగులుతుంది. భవిష్యత్తులో త్రీడీ ప్రింటింగ్ మరింత వేగంగా పుంజుకునే అవకాశం ఉంది. ఇకపై బట్టలను డిజైన్ చేయడానికి పేపర్ గానీ, వస్త్రాలు గానీ అవసరం ఉండవు.