Loading...
Miss Universe 2026: మిస్ యూనివర్స్‌-2026లో భారత్‌కు నిరాశ.. టాప్‌-12లో దక్కని చోటు
మిస్ యూనివర్స్‌-2026లో భారత్‌కు నిరాశ.. టాప్‌-12లో దక్కని చోటు

Miss Universe 2026: మిస్ యూనివర్స్‌-2026లో భారత్‌కు నిరాశ.. టాప్‌-12లో దక్కని చోటు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 25, 2026
10:45 am

ఈ వార్తాకథనం ఏంటి

మిస్ యూనివర్స్‌ 2026 పోటీల్లో భారత్‌కు నిరాశ ఎదురైంది. భారత తరఫున బరిలోకి దిగిన కేరళకు చెందిన 19 ఏళ్ల యువతి కజియా లిజ్ మెజో టాప్‌-12లో స్థానం సంపాదించలేకపోయింది. అయితే అంతకుముందు టాప్‌-30లో చోటు దక్కించుకుని తన ప్రతిభను నిరూపించుకుంది. ప్యూర్టోరికోలో నిర్వహించిన ఈ అంతర్జాతీయ అందాల పోటీల్లో ఆమె భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. తన ప్రదర్శనతో పాటు భారతీయ సంస్కృతి, కేరళ సంప్రదాయాలు, దేశీయ వస్త్ర కళలను ప్రపంచ ప్రేక్షకులకు పరిచయం చేసింది.

వివరాలు 

52 మంది పోటీదారులను ఓడించి జాతీయ కిరీటం

కజియా లిజ్ మెజో 2026 ఆగస్టులో మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకుంది.

ఈ పోటీల్లో మొత్తం 52 మంది అందాల భామలను వెనక్కి నెట్టి విజేతగా నిలిచింది.

తద్వారా మిస్ యూనివర్స్ ఇండియా టైటిల్‌ను గెలుచుకున్న తొలి కేరళ మహిళగా చరిత్ర సృష్టించింది.

నవంబర్ మొదటి వారంలో అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు ప్యూర్టోరికోకు చేరుకుంది.

భారత్ నుంచి బయలుదేరే సమయంలో ప్రముఖ డిజైనర్ సమంత్ చౌహాన్ రూపొందించిన రూ.1.4 లక్షల విలువైన చీరను ధరించింది.

వివరాలు 

కసవు చీర స్ఫూర్తితో ప్రత్యేక గౌను

మిస్ యూనివర్స్ పోటీల్లో భాగంగా నిర్వహించిన వ్యక్తిగత ఇంటర్వ్యూ రౌండ్‌లో కజియా ప్రత్యేకంగా రూపొందించిన గౌనుతో ఆకట్టుకుంది.

కేరళ సంప్రదాయ కసవు చీర స్ఫూర్తితో ఈ దుస్తులను తయారు చేయించారు.

తన రాష్ట్ర మూలాలు, సంప్రదాయాలను గుర్తుచేసేలా ఈ గౌనును ఎంపిక చేసుకున్నట్లు ఆమె వెల్లడించింది.

జుట్టులో అలంకరించుకున్న గజ్రాను తన తొలి అధికారిక ఫొటోషూట్‌కు గుర్తుగా ఎంచుకుంది.

చేతికి ధరించిన గాజు కూడా భారత్ నుంచి బయలుదేరినప్పుడు పెట్టుకున్నదే.

చెవులకు ధరించిన ఆభరణాలు గత ఏడాది మిస్ యూనివర్స్ విజేతకు చెందినవి కావడం మరో విశేషం.

ADVERTISEMENT

వివరాలు 

జాతీయ దుస్తుల్లో భారతీయ సంస్కృతి ప్రతిబింబం

జాతీయ వస్త్రధారణ పోటీలోనూ కజియా తన ప్రత్యేకతను చాటుకుంది.

భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన వస్త్రాలను ఉపయోగించి రూపొందించిన ప్రత్యేక దుస్తులను ధరించింది.

తద్వారా దేశంలోని సంప్రదాయ చేనేత కళలు, వస్త్ర తయారీలోని నైపుణ్యాన్ని అంతర్జాతీయ వేదికపై పరిచయం చేసింది.

స్విమ్‌సూట్ రౌండ్‌లోనూ ఆత్మవిశ్వాసంతో ర్యాంప్‌పై నడిచి ఆకట్టుకుంది.

ADVERTISEMENT

వివరాలు 

టాప్‌-12లో చోటు దక్కకపోయినా ప్రత్యేక గుర్తింపు

మిస్ యూనివర్స్‌-2026 పోటీల్లో టాప్‌-12కు ఎంపికైన దేశాల ప్రతినిధుల జాబితాలో చిలీ, డొమినికన్ రిపబ్లిక్, అమెరికా, న్యూజిలాండ్, క్యూబా, ప్యూర్టోరికో, ఫిలిప్పీన్స్, కొలంబియా, నికరాగువా, వెనెజువెలా, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఫ్రాన్స్ దేశాలకు చెందిన అందాల భామలు ఉన్నారు.

ఈ జాబితాలో భారత ప్రతినిధికి చోటు దక్కలేదు. దీంతో భారత్‌కు నిరాశ ఎదురైనప్పటికీ కజియా తన ప్రదర్శనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

భారతీయ సంస్కృతి, కేరళ సంప్రదాయ వారసత్వం, దేశీయ వస్త్ర కళలను ప్రపంచ వేదికపై చాటిచెప్పి ప్రశంసలు అందుకుంది.

ADVERTISEMENT