ప్రెగ్నెన్సీ సమయంలో ఇచ్చే సలహాలు, వాటి వెనక ఉండే నిజాలు
ప్రెగ్నెన్సీ సమయంలో మీరు సురక్షితంగా ఉండాలి. దానివల్ల మీ కడుపులో ఉన్న బిడ్డ సురక్షితంగా ఉంటుంది. ఐతే కడుపులో శిశువును మోస్తున్న సమయంలో చాలామంది చాలా సలహాలు ఇస్తుంటారు. ఆ సలహాల వెనక ఉన్న నిజాలేంటో చూద్దాం. గుండెల్లో మంటగా ఉంటే పుట్టే బేబీకి తలవెంట్రుకలు వస్తాయని అంటుంటారు. ఇక్కడ నిజం ఏంటంటే, ప్రెగ్నెన్సీ సమయంలో ఈస్ట్రోజన్ ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. దానివల్ల బేబీకి వెంట్రుకలు కూడా వస్తాయి. పిల్లుల నుండి ప్రెగ్నెన్సీ మహిళలను దూరంగా ఉంచాలని చెబుతారు. దానికి కారణం, పిల్లులు ఎలుకలను, పక్షులను, ఇతర జంతువులను తినడం వల్ల వ్యాధి బారిన పడతాయి. ఆ వ్యాధులు ప్రెగ్నెన్సీ మహిళలకు వచ్చే అవకాశం ఉందని అలా చెబుతారు.
ప్రెగ్నెన్సీ సమయంలో వినిపించే మరికొన్ని సలహాలు
ప్రెగ్నెన్సీ మహిళల చర్మం మెరిసిపోతుంది. ఇది నిజమే, ఈ టైమ్ లో చర్మం సాగుతుంది. తేమగా మారుతుంది. దానివల్ల చర్మం మెరుస్తుంది. జుట్టుకు రంగు వేసుకోకూడని సలహా ఇస్తారు. దీనికి కారణం, రంగులోని రసాయనాలు ఒక్కోసారి బేబీకి హాని కలగజేసే అవకాశం ఉంది. ఒకవేళ రంగు వేసుకోవాలనుకుంటే గదిలో కాకుండా విశాలమైన స్థలంలో వేసుకోవడం బెటర్. కాఫీ హాని కలిగిస్తుందని అంటారు. ఎక్కువ శాతంలో కెఫైన్ శరీరంలోకి వెళ్ళడం వల్ల హాని కలుగుతుందని చాలా పరిశోధనల్లో వెల్లడైంది. కాఫీ ఎక్కువగా తాగడం వల్ల పిండానికి ఇబ్బంది కలుగుతుంది. ఒకవైపు మాత్రమే పడుకోవాలని చెబుతారు. డాక్టర్లు కూడా ఇందులో నిజం ఉందని, ఎడమ పక్కమీద పడుకోవడం వల్ల రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుందని అంటారు.