NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / మదర్స్ డే రోజున మీ స్నేహితులతో పంచుకోవాల్సిన సందేశాలు, కొటేషన్లు 
    తదుపరి వార్తా కథనం
    మదర్స్ డే రోజున మీ స్నేహితులతో పంచుకోవాల్సిన సందేశాలు, కొటేషన్లు 
    మదర్స్ డే కొటేషన్లు

    మదర్స్ డే రోజున మీ స్నేహితులతో పంచుకోవాల్సిన సందేశాలు, కొటేషన్లు 

    వ్రాసిన వారు Sriram Pranateja
    May 13, 2023
    05:29 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భగవంతుడు ప్రతీచోట ఉండలేడు కాబట్టే అమ్మను సృష్టించాడు. సృష్టికి మూలం అమ్మ. చివరికి ఆ దేవుడు కూడా అమ్మ కడుపులోంచే పుట్టాడు. అందుకే అమ్మే ఆదిదేవత.

    ఈరోజు మాతృమూర్తుల దినోత్సవం. ఈ సందర్భంగా మీ ఫ్రెండ్స్ తో పంచుకోవాల్సిన సందేశాలు, కొటేషన్లు ఏంటో చూద్దాం.

    ఈ ప్రపంచంలో అమ్మను మించి నిజాయితీ గల స్నేహితులు ఎవ్వరూ లేరు -వాషింగ్టన్ ఇర్వింగ్. ఈ ప్రపంచంలో అమ్మ మాత్రమే నువ్వు ద్వేషించినా నిన్ను ప్రేమిస్తుంది - మాతృమూర్తుల దినోత్సవ శుభాకాంక్షలు.

    బిడ్డ కడుపు నింపడం కోసం, తను పస్తులుంటుంది. బిడ్డ గెలవడం కోసం తను అన్నింట్లోనూ ఓడిపోతుంది. ఈ ప్రపంచంలో తల్లిని మించిన యోధులెవ్వరూ లేరు.

    Details

    అమ్మ కన్నా కమ్మని పదం లేనే లేదు 

    నాలోని భయాన్ని చిటికెలో మాయం చేసి, నా వెనక ఉండి నన్ను ముందుకు నడిపిస్తూ, తన ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా, నా భవిష్యత్తు బాగుండాలని, ఎన్నో త్యాగాలు చేసే మా అమ్మకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను - మదర్స్ డే శుభాకాంక్షలు.

    ప్రాణం కన్నా గొప్పదేదీ లేదంటే, ఆ ప్రాణమిచ్చిన అమ్మ ఇంకెంత గొప్ప కావాలి. ఈ ప్రపంచంలో అమ్మకు సాటి లేదు - మదర్స్ డే శుభాకాంక్షలు.

    అమ్మ గురించి కవిత రాయాలని కూర్చున్నాను. ఐదు నిమిషాలైంది, పది నిమిషాలైంది, పెన్నులో ఇంకు పేపర్ మీదకు జారట్లేదు. ఇరవై నిమిషం పూర్తవుతుండగా, అమ్మ అని రాసాను. అమ్మ అనే పదం కన్నా అందమైన వాక్యం ఇంకేముంటుంది - మదర్స్ డే శుభాకాంక్షలు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ముఖ్యమైన తేదీలు

    తాజా

    Monsoon 2025: ఈశాన్యంలో వరుణుడి ప్రళయం.. 67 ఏళ్ల వర్షపాతం రికార్డు బ్రేక్.. 30 మంది మృతి  అరుణాచల్ ప్రదేశ్
    Narne Nithin : నార్నే నితిన్ సోలో హీరోగా 'శ్రీ శ్రీ శ్రీ రాజవారు' ట్రైలర్ విడుదల టాలీవుడ్
    BigBasket: క్విక్‌ ఫుడ్‌ డెలివరీలో బిగ్‌బాస్కెట్‌ ప్రవేశం.. 10 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ  టాటా
    Russia: రష్యాలో కూలిన మరో వంతెన.. గూడ్స్ రైలు బోల్తా రష్యా

    ముఖ్యమైన తేదీలు

    జాతీయ పరాక్రమ దినోత్సవం: నేతాజీ జ్ఞాపకార్థం స్మారక చిహ్నం ప్రారంభిస్తున్న ప్రధాని మోదీ లైఫ్-స్టైల్
    వరల్డ్ హిప్పో డే: నీటిలో ఈదగలిగి, నీటిమీద తేలలేని ఈ జీవుల గురించి తెలుసుకోవాల్సిన విషయాలు లైఫ్-స్టైల్
    పిత్త వాహిక క్యాన్సర్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు, రావడానికి కారణాలు, ట్రీట్మెంట్ లైఫ్-స్టైల్
    అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం 2023: పిల్లలకు మాతృభాషలో విద్య ఎందుకు అందించాలో తెలుసుకోండి లైఫ్-స్టైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025