మదర్స్ డే: చరిత్ర, ప్రాముఖ్యత, తెలుసుకోవాల్సిన విషయాలు
ఈ వార్తాకథనం ఏంటి
మదర్స్ డే.. మాతృమూర్తుల దినోత్సవం. అమ్మ జన్మనిస్తుంది, ఏడిస్తే లాలిస్తుంది, అలిగితే బుజ్జగిస్తుంది, కష్టమనేది తెలియకుండా చూసుకోవాలని తాపత్రయ పడుతుంది.
ఒక విధంగా చెప్పాలంటే అమ్మ మన జీవితాన్ని నడిపిస్తుంది. తనకోసం ఏదీ దాచుకోకుండా అన్నీ బిడ్డ సంతోషం కోసం ఇచ్చేస్తుంది. మే నెల రెండవ ఆదివారం రోజు మదర్స్ డే.
ఈ సందర్భంగా మదర్స్ డే చరిత్ర ఏంటో తెలుసుకుందాం.
మదర్స్ డే ఎలా ఏర్పడిందనే దానిపై చాలా విషయాలు ప్రచారంలో ఉన్నాయి.
పురాతన కాలంలో గ్రీకులు, రోమన్లు.. రియా, సైబేలే అనే దేవతలను వసంత రుతువులో పూజించేవారు. ఈ పూజలు సంతానోత్పత్తి కోసం, మాతృత్వం కోసం ఉండేవి.
Details
అమెరికాలో మొదలై ఇతర దేశాలకు వ్యాప్తి
16వ శతాబ్దంలో ఇంగ్లాండ్ లోని క్రైస్తవలు మదరింగ్ సండే ని ఒకరోజును జరుపుకునేవారు. ఈరోజున చర్చికి వెళ్ళి ప్రార్థనలు చేస్తారు. అలాగే తమ తల్లులకు పువ్వులు, బహుమానాలు ఇవ్వడం అలవాటుగా ఉండేది.
ఇక ఆధునిక కాలంలో మదర్స్ డే అనేది అమెరికాకు చెందిన అన్నా జార్విస్ అనే సామాజిక కార్యకర్త ద్వారా మొదలైంది. 1905లో తన తల్లి ఆన్ రీవ్ జార్విస్ మరణించడంతో, తల్లుల సేవలను గౌరవించడానికి జాతీయ సెలవు దినాన్ని ప్రకటించాలని ప్రచారం చేసింది.
1914లో అమెరికా అధ్యక్షుడు వూడ్రూ విల్సన్, మే రెండవ ఆదివారం నాడు మదర్స్ డే జరుపుకోవాలని తెలియజేసాడు. అప్పటి నుండి ఇతర దేశాలు కూడా ఇదే రోజును ఫాలో అవుతున్నాయి.