Page Loader
ప్రేరణ: అడుగు వేస్తేనే దారి, నడక సాగితేనే విజయం
ఆరంభం ఒక్క అడుగుతోనే మొదలు

ప్రేరణ: అడుగు వేస్తేనే దారి, నడక సాగితేనే విజయం

వ్రాసిన వారు Sriram Pranateja
Mar 02, 2023
04:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

మనుషులకు కోరికలెక్కువ. ఆ కోరిక తీరితే ఆనందం వస్తుంది. కానీ అది తీరాలంటే ముందుకు అడుగు వేయాలి. కోరికలు తీరని వారందరూ అడుగు వేయకుండా ఆగిపోయిన వారే. అలా ఆగిపోవడానికి కారణం భయం. కోరిక తీర్చుకోవడానికి ముందుకు అడుగు వేస్తే ఏమవుతుందేమోనన్న భయం. ఇప్పటి దాకా బ్రతుకుతున్న జీవితం, ఆ అడుగు వల్ల అంతమైపోతుందేమోనని భయపడతారు. అందుకే చాలామంది ఎదగకుండా ఉండిపోతారు. ఈ ప్రపంచంలో ఎక్కువ మందికి విజయం దక్కకపోవడానికి కారణం, వాళ్ళకు తెలివితేటలు, డబ్బు లేక కాదు. ధైర్యం లేక. అడుగు వేద్దామంటే ఆలోచించి ఆలోచించి చివరకు వెనకడుగు వేసే వాళ్లే ఎక్కువ మంది. కానీ మీరలా ఉండకండి. ముందుకు దూకండి, కొత్తదారుల్లో వెళ్ళండి. అనుకున్నది సాధించండి.

ప్రేరణ

భయాన్ని వీడితే అభయమిచ్చే దిశగా పయనం

కొత్తదారుల్లో కష్టాలు వస్తాయి, రానివ్వండి. అవేగా మీలోని శక్తిని మీకు పరిచయం చేసేవి. కొత్త అడుగులు తడబడతాయి. పడనివ్వండి. పిల్లలు ముందుగా తడబడి ఆపైన అలవాటు పడి, చివరకు పడకుండా నడవగలుగుతారని, మీరు కూడా అలాగే వచ్చారనీ, చిన్నప్పటి లక్షణం మీలో ఇంకా పోలేదని మిమ్మల్ని మీరు ఉత్తేజపర్చుకోండి. అడుగు వేసేదాకా ఎన్నో ఆలోచించిన మీకు అడుగు వేసిన తర్వాత చాలా సులభంగా అనిపిస్తుంది. అడుగు వేస్తే ఏమవుతుందోనని భయపడ్డ మీకు, ఆశర్యంగా మీరనుకున్నవేమీ జరగకుండా సాఫీగా సాగిపోతూ హ్యాపీగా ఉండే అవకాశం ఒక్కోసారి ఉంటుంది. ఆ అవకాశాన్ని మీరు మిస్ చేసుకోవద్దు. అందుకే అడుగు వేయండి అనుకున్నది సాధించండి. ఆ తర్వాత అడుగు వేయడానికి అవతలి వారు ఆలోచిస్తుంటే అభయమివ్వండి.