ప్రేరణ: ఒక పనిని వాయిదా వేసారంటే ఆనందాన్ని కూడా వాయిదా వేసినట్లే
ఈ వార్తాకథనం ఏంటి
ఈరోజు నుండి ఏదైనా కొత్త పని చేయాలనుకుని రంగంలోకి దిగి, కరెక్టుగా ఆ పని చేసే ముందు మరేదో పని గుర్తొచ్చి రేపు చేద్దాంలే అని వదిలేస్తుంటారు. మంచి అలవాట్లను అలవర్చుకోవడం దగ్గరి నుండి అనేక విషయాలను వాయిదా వేస్తుంటారు.
ఈరోజు నుండి అనుకున్నట్లుగా చదివితే ఫస్ట్ ర్యాంక్ వస్తుందని మొదలెడతారు. తీరా కూర్చుని 5నిమిషాలు అవుతుందో లేదో మనసులో ఎన్నో రకాల ఆలోచనలు చేరి ఈరోజు ఎంజాయ్ చెయ్, రేపటి నుండి చదువుకో అన్న ఆలోచనను రప్పిస్తాయి.
ఈ ప్రాసెస్ రేపు కూడా ఇలాగే కొనసాగి చివరికి ఎగ్జామ్ లో ఫెయిల్ కావాల్సి వస్తుంది. వాయిదా వేసేవాళ్ళు తమ పనిని మాత్రమే కాదు, తమ ఆనందాన్ని కూడా వాయిదా వేసుకుంటున్నారు.
Details
వాయిదా ఇచ్చే చిన్న సంతోషమా? పని పూర్తయిన ఆనందమా?
అనుకున్నట్లు సరిగ్గా చదివితే ఫస్ట్ ర్యాంక్ రాకపోయినా కనీసం పాస్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఫెయిలయ్యామన్న బాధ ఉండేది కాదు.
కేవలం చదువు విషయంలో మాత్రమే కాదు, ఏ విషయంలోనైనా మీరొక పనిని వాయిదా వేస్తే మీ ఆనందం కూడా వాయిదా పడుతుంది.
మీకు వాయిదా వేయడం వల్ల వచ్చే చిన్నపాటి సంతోషం కావాలా లేదంటే పని పూర్తవడం వల్ల వచ్చే పెద్దదైన ఆనందం కావాలా మీరే డిసైడ్ చేసుకోండి.
పొద్దున్న లేచి జిమ్ కి వెళ్తే కొన్ని రోజుల్లో మీ బాడీ సరైన షేప్ లోకి వస్తుంది. అందరూ మిమ్మల్ని చూసి అట్రాక్ట్ అవుతుంటారు. అలా కాదని ఉదయం 8గంటల వరకు పడుకుంటే ఎవ్వరూ మీ దగ్గరికి కూడా రారు.