ప్రేరణ: అదృష్టంపై ఆధారపడిన వాడిని గెలవకుండా చేసేది అదృష్టంపై అతడి నమ్మకమే
ఈ వార్తాకథనం ఏంటి
ఈ ప్రపంచంలో కోటి మంది విజేతలుంటే అందులో ఒక్కరు మాత్రమే అదృష్టం కొద్దీ విజేతగా మారిన వారుంటారు. స్పష్టంగా చూస్తే ఆ ఒక్కరు కూడా కనిపించరు.
ఎందుకంటే చాలామందికి అవతలి వారిది అదృష్టం అనిపిస్తుంటుంది. కానీ ఎవరిది వారికే తెలుస్తుంది. తాము ఆ స్టేజికి రావడానికి ఎంత కష్టపడ్డారో, ఎన్ని పోగొట్టుకున్నారో.
అదృష్టాన్ని మీరు నమ్ముకుంటే గనక మీరు గెలవకుండా మీకు మీరే అడ్డుపడుతున్నారని అర్థం. అదృష్టాన్ని నమ్మేవాళ్ళు పనిచేయరు.
ఏదో మహత్తు జరిగి తాము మనసులో అనుకున్నది తీరిపోవాలనుకుంటారు. కానీ మహత్తులు జరుగుతాయో లేదో ఎవ్వరికీ తెలీదు.
ఫలితంగా చేతిలోంచి కాలం జారిపోతుంది. గెలవాలనుకున్న లక్ష్యం దూరమైపోతుంది. చివరికి ఓటమి చేరువై ఏడిపిస్తుంది.
Details
అడుగు వేయకపోతే దారి సాగదు
అదృష్టాన్ని నమ్ముకోకుండా పని చేసుకుంటూ పోతే కనీసం లక్ష్యం వైపు ఎంతో కొంత దూరం ప్రయాణం జరిగి పోయుండేది.
అదృష్టం ఎవరికి వస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. కాబట్టి పని చేసుకుంటూ పోవడమే మంచిది. పని చేయడం మానేసి అద్భుతం జరుగుతుందని ఆశపడితే ఎలాంటి ప్రయోజనం ఉండదు.
అడుగేయనిదే దారి సాగదు, గొడుగు పట్టకుండా వర్షం ఆగదు, కన్ను మూయకుండా నిద్ర రాదు. అందుకే అదృష్టంపై ఆధారపడి ఏ పనీ చేయకుండా కూర్చోవడం కన్నా ఏదో ఒక పని చేసుకుంటూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడమే ఉత్తమమైన పని.