NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / ప్రేరణ: నిన్ను చూసి నవ్వే వాళ్లే నిన్ను ఎదిగేలా చేసేది
    తదుపరి వార్తా కథనం
    ప్రేరణ: నిన్ను చూసి నవ్వే వాళ్లే నిన్ను ఎదిగేలా చేసేది
    నిన్ను చూసి నవ్వే వాళ్లే నిన్ను ఎదిగేలా చేస్తారు

    ప్రేరణ: నిన్ను చూసి నవ్వే వాళ్లే నిన్ను ఎదిగేలా చేసేది

    వ్రాసిన వారు Sriram Pranateja
    Mar 27, 2023
    05:17 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    నువ్వొక పని మొదలు పెట్టావ్, ఆ పని గురించి నీకేమీ తెలియదు. అయినా సరే ప్రారంభించావ్. పనిమీద అవగాహన లేకపోవడం వల్ల నువ్వు ఆ పనిని సరిగ్గా చేయట్లేదు.

    అది చూసి నీ పక్కనున్న వాళ్ళందరూ నవ్వుతున్నారు. హేళన చేస్తున్నారు. ఛీ ఛీ అని నీ పరువు తీస్తున్నారు. ఇలాంటి టైమ్ లో నువ్వు వాళ్ళ మాటలకు భయపడి పనిని మానేసావనుకో, నీకెప్పటికీ ఆ పని గురించి తెలియకుండానే పోతుంది.

    వాళ్ళ మాటలను స్వీకరించు. నీకు తెలియదన్న నిజాన్ని ఒప్పుకో. కానీ ఓటమిని ఒప్పుకోకు. తెలుసుకోవాలన్న కోరికను వదులుకోకు. నీకు ఏ విషయాల్లోనైతే చేతకాదని వాళ్లంటున్నారో, ఆ విషయాల మీదే దృష్టి పెట్టు.

    ప్రేరణ

    ఏమీ చేయకుండా వచ్చిన విజయం కిక్ ఇవ్వదు

    నిన్ను ఎవరైతే హేళన చేస్తున్నారో వాళ్ళు ఒకరకంగా నీకు మేలు చేస్తున్నట్లే లెక్క. ఎందుకంటే నువ్వు చేసే పనిలో నీకేం రాదో నీకు తెలియజేస్తున్నారు. అంటే, అది నువ్వు నేర్చుకోవాలని సూచిస్తున్నారు.

    ఆ సూచనలను నువ్వు జాగ్రత్తగా స్వీకరించు. నువ్వు ఖచ్చితంగా ఎదుగుతావ్. మొదట్లో ఓడిపోతావేమో కానీ చిట్టచివరికి నువ్వే గెలుస్తావ్. అప్పుడు నిన్ను హేళన చేసిన వారు నిన్ను చూసి నోరెళ్ళ బెడతారు.

    అందుకే, ఏదైనా పనిచేస్తున్నప్పుడు ముందుగా ఓటమి ఎదురవుతుంది. అవమానమే ఎదురవుతుంది. నువ్వు అనుకోగానే విజయం అమాంతం వచ్చేయదు. ఒకవేళ అలా వచ్చినా నీకంత పెద్దగా కిక్ ఉండదు.

    అవమానాలు రావాలి, సవాళ్ళు రావాలి. వాటిని ఎదుర్కోవడంలో నువ్వు రాటు దేలాలి. అప్పుడే విజయంలో అసలైన కిక్కుంటుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రేరణ

    తాజా

    Stock Market: లాభాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@24,600 స్టాక్ మార్కెట్
    Flood Situation: ఈశాన్యంలో ప్రకృతి ప్రళయం.. వరదల బీభత్సంతో 43 మంది మృతి వరదలు
    Cash Row: జస్టిస్‌ యశ్వంత్‌ వర్మపై అభిశంసనకు కేంద్రం రంగం సిద్ధం  కేంద్ర ప్రభుత్వం
    Andhra Pradesh: ఏపీలో నేషనల్ హైవే ఆరు లైన్లుగా.. కేంద్రం ముందుకు ప్రతిపాదనలు శ్రీకాకుళం

    ప్రేరణ

    మీకు స్వార్థం ఉందా? ఎలాంటి విషయాల్లో స్వార్థం మంచిదో తెలుసుకోండి నిద్రలేమి
    ప్రేరణ: అడుగు వేస్తేనే దారి, నడక సాగితేనే విజయం లైఫ్-స్టైల్
    ప్రేరణ: సాధించాలన్న సంకల్పం ఉంటే విశ్వం కూడా సాయం చేస్తుంది లైఫ్-స్టైల్
    ప్రేరణ: ప్రయత్నిస్తే పదిరోజుల్లో రాని విజయం వందరోజుల్లో వచ్చే అవకాశం లైఫ్-స్టైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025