మ్యూఛువల్ ఫండ్స్: సిప్ లో తొందరగా ఇన్వెస్ట్ ఎందుకు చేయాలో తెలుసుకోండి
మ్యూఛువల్ ఫండ్లలో ఎంత తొందరగా పెట్టుబడి పెడితే అంత ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయం ఎవరికైనా చెబితే పెట్టుబడి పెట్టడానికి డబ్బుండాలి కదా అంటారు. అలాంటి వారికి సిప్(SIP) బాగా ఉపయోగపడుతుంది. సిప్ లో 500 రూపాయల నుండి మొదలుకుని ఎంతైనా పెట్టవచ్చు. సిప్ అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్. దీనిలో నెలకి 2వేల రూపాయలు పెడితే, ప్రతీ నెల మీరు ఎంచుకున్న తేదీ రోజు 2వేల రూపాయలు మీ బ్యాంక్ నుండి మ్యూఛువల్ ఫండ్స్ కి వెళ్ళిపోతుంది. మ్యూఛువల్ ఫండ్లలో చక్రవడ్డీ ఉంటుంది. దీనివల్ల మీరు ఇన్వెస్ట్ చేసిన దాని మీద వచ్చిన వడ్డీకి కూడా వడ్డీ వస్తుంది.
సిప్ లో తొందరగా ఇన్వెస్ట్ చేయడం వల్ల కలిగే లాభాలు
తొందరగా ఇన్వెస్ట్ చేయడం వల్ల, డబ్బును ఏ విధంగా ఖర్చు చేయాలో అర్థం అవుతుంది. మీకంటూ ఒక ఫైనాన్షియల్ గోల్ ఏర్పడుతుంది. దానివల్ల ఆ గోల్ చేరుకోవడానికి మీరు డబ్బును ఖర్చు చేస్తుంటారు. అదీగాక కొత్తగా ఇన్వెస్ట్ చేసినపుడు తప్పులు జరుగుతుంటాయి. అవన్నీ తక్కువ వయసులో జరిగిపోతే, మీ వయసు పెరిగినపుడు అనుభవం వస్తుంది. అప్పుడు మీరు మళ్ళీ తప్పులు చేయకుండా ఉంటారు. 20ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తే, ఏదైనా రిస్క్ వచ్చి లాభాలు పెద్దగా రాకపోయినా తట్టుకోగలుగుతారు. అదే 30ఏళ్ళలో ఇన్వెస్ట్ చేసినపుడు రిస్క్ వస్తే తట్టుకోవడం కష్టమవుతుంది. 20ఏళ్లలో చేసే తక్కువ ఇన్వెస్ట్ మెంట్, 30ఏళ్ళ తర్వాత చేసే ఎక్కువ ఇన్వెస్ట్ మెంట్ కన్నా ఎక్కువ లాభాలను ఇస్తుంది.