నాగుల పంచమి జరుపుకోవడం వెనక కారణాలు, తెలుసుకోవాల్సిన విషయాలు
నాగుల పంచమి.. ప్రతీ ఏడాది శ్రావణ మాసం శుక్లపక్షం ఐదవ రోజున నాగుల పంచమి జరుపుకుంటారు. ఈ రోజున నాగదేవతలకు పూజలు చేస్తారు. దాదాపు భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో ఈ పండగ జరుపుకుంటారు. సర్పాలను దేవుళ్ళుగా కొలవడం హిందూ పురాణాల్లో ఉంది. శివుడి మెడలో పాము ఉంటుందని అందరికీ తెలిసిందే. 2023సంవత్సరంలో ఆగస్టు 21వ తేదీన నాగుల పంచమి జరుపుకుంటున్నారు. ఈ రోజున పాము పుట్టల వద్దకు వెళ్ళి పాలు పోసి వస్తుంటారు. అయితే నాగుల పంచమి జరుపుకోవడానికి ఒక కారణం ఉంది. పురాణాల్లోని కథ ప్రకారం, తక్షక్ జాతికి చెందిన సర్పం చేతిలో పరీక్షిత్ చనిపోవడంతో పాముల మీద పగతీర్చుకోవాలని పరీక్షిత్ కుమారుడు జన్మజేయుడు అనుకుంటాడు.
నేపాల్ లో నాగుల పంచమి
పాముల మీద పగ తీర్చుకోవాలని తక్షక్ జాతి సర్పాలను అంతం చేయాలని యజ్ఞం నిర్వహిస్తుంటాడు. పాములను అంతం చేయాలనుకోవడం సమంజసం కాదని భావించిన జరత్కారు రుషి కుమారుడు యజ్ఞానికి భంగం కలిగిస్తాడు. శ్రావణ శుక్ల పంచమి రోజున ఆ యజ్ఞం ఆగిపోతుంది. యజ్ఞం ఆగిపోవడంతో పాములు రక్షించబడతాయి. అందువల్ల అప్పటి నుండి శ్రావణ మాసం శుక్ల పక్షం ఐదవ రోజున నాగుల పంచమి జరుపుకుంటారు. నాగుల పంచమిని మనదేశంలో మాత్రమే కాదు నేపాల్ లో కూడా జరుపుకుంటారు. నాగుల పంచమి రోజున భక్తులు ఎక్కువగా శివాలయాలకు వెళ్తుంటారు. లింగం చుట్టూ చుట్టుకున్న పాముకు పాలతో అభిషేకాలు చేస్తుంటారు.