Page Loader
రాజీవ్ గాంధీ మరణించిన రోజును జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటున్నారు? 
జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం

రాజీవ్ గాంధీ మరణించిన రోజును జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటున్నారు? 

వ్రాసిన వారు Sriram Pranateja
May 21, 2023
10:48 am

ఈ వార్తాకథనం ఏంటి

జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని ప్రతీ సంవత్సరం మే 21వ తేదీన జరుపుతారు. ఉగ్రవాద చర్యలను అరికట్టడానికి, దేశ ప్రజల్లో ఐక్యతను పెంపొందించడానికి, జాతీయ భావాన్ని పెంచడానికి జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుతున్నారు. ఉగ్రవాదం కారణంగా దేశానికి ఎలాంటి హాని కలుగుతుందో, దేశ అభివృద్ధికి ఉగ్రవాదం ఎంతటి విఘాతాన్ని కలిగిస్తుందో దేశ ప్రజలకు అవగాహనకు కల్పించడానికి ఈరోజున అనేక కార్యక్రమాలు జరుపుతారు. అలాగే గతంలో జరిగిన ఉగ్రవాద దాడుల వల్ల దేశం ఎంటటి అనర్థాలను ఎదుర్కొన్నదో ఈరోజు తెలియజేస్తారు. చరిత్ర: రాజీవ్ గాంధీ మరణించిన రోజును ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా జరపాలని నిర్ణయించారు.

Details

మే 21న రాజీవ్ గాంధీ హత్య 

సరిగ్గా 32సంవత్సరాల క్రితం 1991 మే 21వ తేదీన తమిళనాడులోని శ్రీ పెరుంబుదూర్ ప్రాంతంలో లిబరేషన్ టైగర్స్ తమిళ ఈలమ్ (ఎల్‌టీటీఈ) అనే ఉగ్రవాద సంస్థ చేతిలో హత్య గావించబడ్డాడు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన విపి సింగ్ ప్రభుత్వం, మే 21వ తేదీని ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది. ఉగ్రవాద దాడుల వల్ల బాధితులుగా మిగిలినవారిని ఈరోజున స్మరించుకుంటారు. అలాగే ఉగ్రవాదంపై పోరుకు అందరినీ ఐక్యం చేయడానికి ఈ ప్రత్యేకమైన రోజును జరుపుకుంటోంది. ఈ రోజున అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో ఉగ్రవాద వ్యతిరేక ప్రతిజ్ఞలు చేస్తారు. సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లలో ఉగ్రవాద వ్యతిరేక మెసేజ్ లు పంపిస్తారు.