జాతీయ శనగల దినోత్సవం: శనగలతో తయారయ్యే నోరూరించే రెసిపీస్
అమెరికాలో ప్రతీ సంవత్సరం ఏప్రిల్ 21వ తేదీన జాతీయ శనగల దినోత్సవాన్ని జరుపుతారు. శనగల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై అందరికీ అవగాహన కలిగించేందుకు ఈరోజును జరుపుతారు. ప్రస్తుతం శనగలతో తయారయ్యే రెసిపీస్ గురించి తెలుసుకుందాం. సూప్: ఒక పాత్రలో నూనె పోసి ఉల్లి, వెల్లుల్లి, అల్లం కలిపి వేయించాలి. దీనికి గరం మసాలా, క్యారెట్లు, బీన్స్ జోడించాలి. 10నిమిషాలు తక్కువ మంట మీద వేడిచేసి నానబెట్టిన శనగలను అందులో వేయాలి. ఇప్పుడు శనగలు సహా అన్నింటినీ ఒక గ్రైండర్ లో వేసి రుబ్బాలి. కొన్ని నీళ్ళు కలుపుకుంటే మంచి మిశ్రమం తయారవుతుంది. గ్లాసుల్లో పోసుకుని హ్యాపీగా తాగేసేయండి.
శనగలతో తయారయ్యే సలాడ్, వడలు
సలాడ్: జీలకర్రను బాగా నలిపి, దంచుకుని పొడి తయారు చేయండి. ఈ పొడిని ఒక పాత్రలో వేసి ఉల్లిగడ్డలు, కొత్తిమీర, పుదీనా, నానబెట్టిన శనగలు, చాట్ మసాలా, నిమ్మరసం కలపాలి. వీటన్నింటినీ బాగా కలిపి 30నిమిషాలు పక్కన పెట్టాలి. దానివల్ల అన్ని పదార్థాలు ఒకదానికొకటి బాగా కలిసిపోతాయి. శనగ వడలు: నానబెట్టిన శనగలను రుబ్బి పొడిచేయాలి. దానికి పచ్చిగుడ్డు కలిపి పిండి తయారు చేయాలి. దీన్ని మరో పాత్రలోకి తీసుకుని వెల్లుల్లి, ధన్యాలు, కారం కలపి మిశ్రమం తయారు చేయండి. ఆ తర్వాత ఆ పిండితో వడలు తయారు చేసి నూనెలో వేయించండి. బంగారు రంగులోకి వడలు మారగానే నూనెలోంచి తీసి పక్కన పెట్టండి.