నేషనల్ డాక్టర్స్ డే 2023: ప్రాచీన భారతదేశ మొదటి వైద్యుల గురించి మీకు తెలియని విషయాలు
ప్రతీ ఏడాది జులై 1వ తేదీన జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జరుపుతారు. వైద్యులు సమాజానికి చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఈరోజును జరుపుతారు. ఈ నేపథ్యంలో ప్రాచీన భారతదేశంలోని తొలితరం వైద్యుల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. చరకుడు: ఆయుర్వేద పిత అని పిలవబడే చరకుడు, క్రీస్తు శకం 150-200సంవత్సర కాలంలో జీవించాడు. ఆయుర్వేదంలో ఎన్నో ప్రయోగాలు చేసిన గొప్ప వ్యక్తి చరకుడు. ఆయన ఆయుర్వేద గ్రంధమైన చరక సంహితను రచించాడు. అంతేకాదు ఆయుర్వేదంపై అనేక గ్రంధాలు రాసాడు. ఇప్పుడు కూడా ఆయుర్వేదంలో చరక సంహిత గ్రంధ సారాన్ని ఉపయోగిస్తున్నారు. శుశ్రుతుడు: ఫాదర్ ఆఫ్ సర్జరీ అని పిలవబడే శుశ్రుతుడు శుశ్రుత సంహిత గ్రంధాన్ని రాసాడు. సర్జరీ గురించిన విషయాలు శుశ్రుత సంహితలో ఉన్నాయి.
ఆయుర్వేదాన్ని వ్యాప్తి చేయడంలో కృషి చేసిన వైద్యులు
వాగ్భాట: సింహగుప్తుల కుమారుడైన వాగ్భాట, సింధు ప్రాంతంలో జన్మించాడు. వైద్య విభాగంలో ఎన్నో పరిశోధనలు చేయడమే కాకుండా అనేక రచనలు చేసారు. అస్తాతిగసతిగ్రహ, ఇస్తాతిగహృదయ అనే రెండు గ్రంధాలు రాసాడు. క్లిష్టమైన వైద్య వ్యాసాలను సామాన్యులకు అర్థమయ్యే భాషల్లో అనువదింపజేసారు. మాధవాచార్య: క్రీస్తు శకాం 700సంవత్సరంలో జన్మించిన మాధవాచార్య, వైద్య విధానాల మీద మాధవ నిదానం అనే గ్రంధాన్ని రాసాడు. ఈ గ్రంధానికి ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఆయుర్వేద రంగాన్ని విస్తృతం చేయడానికి మాధవాచార్య ఎంతగానో కృషి చేసారు. ఆత్రేయ: కాయ చికిత్స(జనరల్ మెడిసిన్)లో ఆత్రేయ ఎంతో ప్రసిద్ధి చెందారు. ఆయుర్వేదంలోని త్రిదోష, పంచభూత, రాస, గుణ, వీర్య, విపాక, ప్రభావ వంటి చికిత్సలకు పునాదులను వేసినవారిలో ఆత్రేయ ప్రముఖులు.