
జాతీయ చేనేత దినోత్సవం: చీరలు కాకుండా మనం రోజూ ఉపయోగించగలిగే చేనేత వస్త్రాలు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతీ ఏడాది ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సందర్భంగా చేనేత వస్త్రాల గురించి తెలుసుకుందాం. చేనేత వస్త్రాలు అనే మాట రాగానే అందరూ చీరల గురించి చర్చిస్తారు. చేనేత చీరలు చాలా ఫేమస్.. అయితే చీరలు మాత్రమే కాకుండా చేనేత వస్త్రాల వెరైటీ ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కుర్తాలు: మగ్గంపై నేసిన కుర్తాలు, కుర్తీలు సంప్రదాయబద్ధంగా, పద్ధతిగా మంచి లుక్ అందిస్తాయి. వీటిల్లో చాలా రకాల వెరైటీలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. శాలువాలు, దుపట్టాలు: చేతితో నేసిన స్కార్ఫ్, దుపట్టాలు, శాలువాలు చూడడానికి ఆకర్షణీయంగా ఇంకా ఏ సందర్భంలోనైనా ధరించే విధంగాను ఉంటాయి. వీటి డిజైన్లు, స్టైల్స్ మీకు కొత్త అందాన్ని ఇస్తాయి.
Details
పర్యావరణాన్ని రక్షించే చేనేత వస్త్రాలు
టాప్స్: స్కట్స్, పాంట్స్, జీన్స్ మీదకు సూట్ అయ్యేలా రకరకాల టాప్స్ చేనేత వస్త్రాల్లో మీకు దొరుకుతాయి. ఇక్కత్ డిజైన్ గల టాప్స్ ఇంకా సాధారణంగా బయటకు వెళ్లడానికి ధరించే టాప్స్ చేనేత వస్త్రాల్లో ఉన్నాయి. చేనేత వస్త్రాలను ప్రోత్సహించే అభిలాష మీకుంటే అందులోని రకరకాల వెరైటీలు మీకు కనిపిస్తాయి. హ్యాండ్ బ్యాగ్స్: ఆడవాళ్లు బయటకు వెళ్ళినప్పుడు తమతో పాటు కచ్చితంగా తీసుకెళ్లే వాటిల్లో హ్యాండ్ బ్యాగ్ తప్పకుండా ఉంటుంది. చేనేత వస్త్రాలతో చేసిన హ్యాండ్ బ్యాగ్స్ మీకు మార్కెట్లో విరివిగా లభిస్తాయి. రకరకాల ఆకారాల్లో ఆకర్షణీయంగా ఉండే హ్యాండ్ బ్యాగ్స్ మార్కెట్లో ఉన్నాయి. వీటివల్ల పర్యావరణం సురక్షితంగా ఉంటుంది.