LOADING...
PM Mudra Yojana: గ్యారెంటీ అవసరం లేదు.. రూ.20 లక్షల వరకు రుణం.. ఈ అవకాశం ఎవరికంటే?
గ్యారెంటీ అవసరం లేదు.. రూ.20 లక్షల వరకు రుణం.. ఈ అవకాశం ఎవరికంటే?

PM Mudra Yojana: గ్యారెంటీ అవసరం లేదు.. రూ.20 లక్షల వరకు రుణం.. ఈ అవకాశం ఎవరికంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 18, 2026
04:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈ రోజుల్లో డబ్బు అవసరమైతే.. తిరిగి ఇస్తామన్న గ్యారెంటీ ఉన్నా సొంతవాళ్లే చేతులు దులుపుకుంటున్నారు. అలాంటిది ఎలాంటి గ్యారెంటీ, షురిటీ లేకుండానే రూ.20 లక్షల వరకు రుణం లభిస్తుందంటే ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ ఇది వాస్తవమే. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఓ పథకం ద్వారా ఈ అవకాశం అందుబాటులో ఉంది. ఆ పథకం ఏమిటి, ఎవరు ఈ రుణాన్ని ఇస్తారు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి అన్న పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. యువతకు, స్వయం ఉపాధి ప్రారంభించాలనుకునే వారికి తోడ్పాటు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రుణ పథకాన్ని అమలు చేస్తోంది.

Details

రూ.20లక్షల వరకు రుణం

వ్యాపారం ప్రారంభించడానికి లేదా ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని విస్తరించడానికి రూ.20 లక్షల వరకు రుణం అందిస్తోంది. ఈ రుణానికి ఎలాంటి పూచీకత్తు అవసరం లేదు. పూర్తిగా గ్యారెంటీ లేని రుణం కావడం ఈ పథకానికి ప్రధాన ప్రత్యేకత. గతంలో ఈ పథకం కింద గరిష్ఠంగా రూ.10 లక్షల వరకు మాత్రమే రుణం ఇచ్చేవారు. అయితే FY 2024-25బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. ముద్ర యోజన కింద రుణ పరిమితిని రూ.20లక్షలకు పెంచుతున్నట్లు వెల్లడించారు. దీంతో చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు మరింత ఊతం లభించనుంది. ఈ పథకం పేరు ప్రధాన్ మంత్రి ముద్ర యోజన (PMMY). ఈ పథకం ద్వారా నాలుగు విభాగాల్లో రుణాలు అందిస్తారు.

Details

ఏ భారతీయ పౌరుడౌనా దరఖాస్తు చేసుకోవచ్చు

శిశు కేటగిరీ : రూ.50 వేల వరకు రుణం కిషోర్ కేటగిరీ : రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు తరుణ్ కేటగిరీ : రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు తరుణ్ ప్లస్ కేటగిరీ : రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఈ విధంగా వ్యాపారం దశలవారీగా అభివృద్ధి చెందేందుకు అవసరమైన రుణ సదుపాయాన్ని కేంద్రం కల్పిస్తోంది. ప్రధానమంత్రి ముద్ర యోజనను మోడీ ప్రభుత్వం 2015లో ప్రారంభించింది. స్వంతంగా వ్యాపారం పెట్టాలనుకునే వారే దీని ప్రధాన లక్ష్య వర్గం. 8వ తరగతి ఉత్తీర్ణులైనా సరే, ఏ భారతీయ పౌరుడైనా ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు.

Advertisement

Details

విద్యా అర్హత అవసరం లేదు

దీనికి ప్రత్యేకమైన విద్యా అర్హతలు అవసరం లేదు. దరఖాస్తు చేసుకునేందుకు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, నివాస ధృవీకరణ పత్రం, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, వ్యాపార ప్రణాళిక, KYC పత్రాలు, ఆదాయ రుజువు వంటి డాక్యుమెంట్లు అవసరం. ఆసక్తి గల వారు [https://www.mudra.org.in/](https://www.mudra.org.in/) వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే సమీపంలోని బ్యాంకుల ద్వారా కూడా ఈ రుణ పథకానికి అప్లై చేసుకునే అవకాశం ఉంది.

Advertisement