కుక్క కరిచినపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ట్రీట్మెంట్ ఏంటో ఇక్కడ తెలుసుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
కుక్క కాటు చాలా ప్రమాదకరం, మీరు పెంచుకునే కుక్క అయినా, వీధి కుక్క అయినా మిమ్మల్ని కరిచినప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే అనేక అపాయాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ప్రస్తుతం కుక్క కరిచినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఎలాంటి ట్రీట్మెంట్ అవసరమవుతుందో ఇక్కడ తెలుసుకుందాం.
గాయాన్ని శుభ్రంగా కడగాలి
కుక్క కరిచిన వెంటనే సబ్బుతో ఐదు నుంచి పది నిమిషాల వరకు గాయాన్ని పూర్తిగా శుభ్రంగా కడగాలి. గాయం పైన సబ్బును బలంగా రుద్దకుండా నెమ్మదిగా రుద్దాలి. దీనివల్ల గాయం పైన సూక్ష్మక్రిములు తొలగిపోతాయి.
గాయం నుండి రక్తం కారుతున్నట్టయితే సురక్షితమైన వస్త్రంతో గాయంపై కప్పాలి. స్టెరిలైజ్ బ్యాండేజ్ వేసినా సరిపోతుంది.
Details
రేబిస్ వ్యాక్సిన్, టెటానస్ వ్యాక్సిన్ తప్పనిసరి
వైద్యుడిని సంప్రదించాలి:
కుక్కకాటు చిన్నదైనా పెద్దదైనా ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి. కాటు కారణంగా గాయం ఎంత మేరకు అయ్యిందో వైద్యుడు తెలుసుకుంటాడు. కొన్ని కొన్ని సార్లు కుక్క కాటు వల్ల కండరాలు, నరాలు ఎముకలకు కూడా గాయమవుతుంది.
ఇంజక్షన్లు, మందులు:
కరిచిన కుక్క ఆరోగ్యం ఎలాంటి స్థితిలో ఉందో తెలియదు కాబట్టి ఇంజక్షన్లు తీసుకోవాలి. రేబిస్ వ్యాక్సిన్, టెటానస్ వ్యాక్సిన్ తీసుకోవాలి. వైద్యులు సూచించిన మేరకు 14 రోజులపాటు యాంటీబయాటిక్స్ వాడాలి.
కుక్క కరిచినప్పుడు ఏమి చేయకూడదంటే:
గాయం చిన్నది కదా అని వైద్యుడిని సంప్రదించకుండా ఉండడం మంచిది కాదు. కుక్క కాటు కారణంగా హాని చేసే బ్యాక్టీరియాలు రక్తంలోకి ప్రవేశిస్తాయి. దీనివల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతాయి.