Pityriasis Rosea: మిస్టీరియస్ చర్మ వ్యాధి పిటురైసిస్ రోసియా గురించి తెలుసుకోవాల్సిన విషయాలు
మీ చర్మం పై అకస్మాత్తుగా దద్దుర్లు వచ్చాయా? అవి ఎందుకు ఏర్పడ్డాయో మీకు తెలియడం లేదా? అయితే అది పిటురైసిస్ రోసియా కావచ్చు. ప్రస్తుతం ఈ మిస్టీరియస్ చర్మ వ్యాధి గురించి తెలుసుకుందాం. పిటురైసిస్ రోసియా అంటే ఏమిటి? ఈ చర్మవ్యాధి అన్ని రకాల వయసుల వారికి వ్యాపిస్తుంది. 10నుంచి 35ఏళ్ల మధ్య గల వయస్సు వారిలో ఈ వ్యాధి ఎక్కువగా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సోకిన వారిలో చర్మంపై గులాబీ రంగులో దద్దుర్లు ఏర్పడతాయి. మొదట్లో ఇవి చాలా చిన్నవిగా ఉంటాయి. కానీ రానురాను ఇవి చాలా పెద్దవిగా తయారవుతాయి. ఇలా పెద్దగా తయారైన గులాబీ రంగు దద్దుర్లను హెరాల్డ్ ప్యాచ్ అంటారు.
పిటురైసిస్ రోసియా లక్షణాలు, కారణాలు
ముందుగానే చెప్పినట్టు గులాబి రంగులో, కోడిగుడ్డు ఆకారంలో దద్దుర్లు కనిపిస్తాయి. ఆ తర్వాత ఎర్రగా మచ్చలు ఏర్పడి దురద పుట్టిస్తుంటాయి. ఈ దురద ఒక్కోసారి నార్మల్ గా ఉంటుంది. మరికొన్నిసార్లు చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ వ్యాధి సోకిన వారికి జలుబు వచ్చే అవకాశం ఎక్కువ. అంతేకాదు తీవ్రమైన అలసట, తలనొప్పి వంటి లక్షణాలు కూడా ఉంటాయి. దద్దుర్లు అనేవి చేతులు, కాళ్లు, మెడ, ముఖం భాగాల్లో కనిపిస్తాయి. పిటురైసిస్ వ్యాధి కారణాలు: సాధారణంగా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ఈ వ్యాధి సోకుతుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే ఈ వ్యాధి సోకే అవకాశం ఎక్కువ. కొన్ని కొన్ని సార్లు జన్యుపరంగా కూడా ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది.