
రాఖీ పండగ: ఇంట్లో ఆడే ఆటలతో పండగను మరింత ఉత్సాహంగా మార్చేయండి
ఈ వార్తాకథనం ఏంటి
రాఖీ పండగ అంటే కేవలం రాఖీ కట్టడమే కాదు, అన్నాతమ్ముళ్ళు, అక్కాచెల్లెళ్ళ మధ్య బంధాన్ని బలపర్చడం కూడా. ప్రస్తుతం ఆ బంధాలను బలపర్చడానికి కొన్ని ఆటలను మీకు పరిచయం చేస్తున్నాం.
ఈ ఆటలు ఇంట్లో ఉండే ఆడుకోవచ్చు. అన్నాతమ్ముళ్ళు, అక్కాచెల్లెళ్ళ మధ్య బంధాన్ని పెంచే ఇండోర్ గేమ్స్ ఏంటో చూద్దాం.
మోనోపొలి సూపర్ ఈ బ్యాంకింగ్:
రాఖీ పండుగ రోజు అన్నాతమ్ముళ్ళు, అక్కా చెల్లెలు ఈ గేమ్ సులభంగా ఆడవచ్చు. మార్కెట్లో దొరికే సూపర్ ఈ బ్యాంకింగ్ బోర్డ్ తీసుకురండి. అందులో నుండి మీకు నచ్చిన ప్రాపర్టీస్ కొనుక్కొని పెట్టుబడులు పెట్టండి.
దీనివల్ల వ్యాపార మెలకువలు తెలియడంతో పాటు బంధాలు పెరుగుతాయి
Details
పిల్లలతో ఆడించే ఆటలు
రాఖీలు తయారు చేయడం:
మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నట్లయితే వారిని రాఖీలు తయారు చేయమని చెప్పండి. రాఖీలు తయారు చేయడానికి కావలసిన వస్తువులు కొనివ్వండి. దీనివల్ల పిల్లల్లో క్రియేటివిటీ పెరుగుతుంది.
అలాగే తాము తయారు చేసిన రాఖీలు తాము కట్టుకోవడం వల్ల ఒక రకమైన సంతృప్తిని పిల్లలు ఫీలవుతారు.
కథలు చెప్పే కాంపిటీషన్:
రాఖీ పండగ రోజు మీ పిల్లలను ఏవైనా కథలు చెప్పమని అడగండి. రాఖీ పండుగ గురించి తమకు తెలిసిన కథలు చెప్పమనండి. కథలు చెప్పడం వల్ల పిల్లల్లో ఊహాశక్తి బాగా పెరుగుతుంది. పిల్లలకు కథలు తెలియకపోతే మీరే కొన్ని కథలు వాళ్లకు చెప్పండి.
Details
డిటెక్టివ్ తరహాలో ఆసక్తికర గేమ్
క్లూడో:
మర్డర్ మిస్టరీని ఛేదించే గేమ్ ఇది. దీనికి సంబంధించిన బోర్డు మార్కెట్లో దొరుకుతుంది. ఈ గేమ్ ద్వారా హత్య చేసింది ఎవరనే విషయం కనుక్కోవాల్సి ఉంటుంది. డిటెక్టివ్ తరహాలో ఉండే ఈ గేమ్ చాలా ఆసక్తిగా ఉంటుంది. ఆకట్టుకునే మలుపులు అద్భుతంగా అనిపిస్తాయి.
శాసన్:
ఇదొక రాజకీయ క్రీడ. మార్కెట్లో దీనికి సంబంధించిన బోర్డ్ అందుబాటులో ఉంటుంది. రాజకీయంలో పార్టీల మధ్య ఉండే పొత్తులు, డిబేట్లు, మొదలగు వాటికి సంబంధించిన అంశాలతో గేమ్ ఆడాల్సి ఉంటుంది. మీలో ఉన్న రాజకీయ నాయకుడిని బయటకు తీసే గేమ్ ఇది.