
పిల్ల ఏనుగులు కొట్లాడుకునే వీడియోను షేర్ చేసిన ఫారెస్ట్ ఆఫీసర్, ఆశ్చర్యపోతున్న ఇంటర్నెట్
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ ప్రవీణ్ కాస్వాన్ తరచుగా అడవి గురించి రకరకాల వీడియోలు షేర్ చేస్తుంటారు. అడవిలో కనిపించే జంతువులను, పక్షులను తన కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు.
ఈ వీడియోలకు ఇంటర్నెట్ లో మంచి రెస్పాన్స్ వస్తుంటుంది. తాజాగా రెండు పిల్ల ఏనుగులు పోట్లాడుకునే వీడియోను షేర్ చేసాడు ప్రవీణ్.
ఈ వీడియోలు రెండు పిల్ల ఏనుగులు ఒకదానికొకటి ఎదురు తిరుగుతూ మీదమీదకు వెళ్తున్నాయి. ఆకారంలో కొంచెం పెద్దగా ఉన్న ఏనుగు, దానికంటే చిన్న ఏనుగును తోసుకుంటూ వెళ్తుండగా, మధ్యలో పెద్ద ఏనుగులు వచ్చి పోట్లాటను సద్దుమణిగేలా చేసాయి.
ఇద్దరు అన్నదమ్ములు పోట్లాడుతుంటే మధ్యలో పెద్దలు వచ్చేస్తారని ఆ వీడియోకు క్యాప్షన్ పెట్టాడు ప్రవీణ్.
Details
ప్రవీణ్ ని పొగుడుతూ కామెంట్లు
ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఇప్పటివరకు ట్విట్టర్ లో దాదాపు లక్ష మందికి పైగా ఈ వీడియోను సందర్శించారు. అంతేకాదు, వీడియోపై కామెంట్లు చేస్తున్నారు.
అడవి గురించి నువ్వు అప్లోడ్ చేసే ప్రతీ వీడియో బాగుంటుంది, ఈ వీడియో కూడా చూడ ముచ్చటగా ఉందని ప్రవీణ్ ని పొగుడుతూ ఒక యూజర్ కామెంట్ చేసాడు. మరొకరేమో, వీడియో చాలా బాగుందనీ, క్యూట్ గా కొట్లాడుకుంటున్నాయని అన్నారు.
పిల్లలు కొట్లాడుతుంటే పెద్దలో మధ్యలోకి రావడం కామన్ అని ఇంకొక యూజర్ కామెంట్ చేసారు.
గతంలో ఒక నీటి కుంట చుట్టూ సీతాకోక చిలుకల గుంపు చేరిన వీడియోను ప్రవీణ్ కాస్వాన్ పోస్ట్ చేసారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఏనుగులు పోట్లాడుతున్న వీడియో
When in cousins fight elders have to intervene. pic.twitter.com/TiCATz8uZ6
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) April 25, 2023