Pregnancy: ప్రెగ్నెన్సీ సమయంలో డ్రైవింగ్ చేస్తున్నారా?
ఈ వార్తాకథనం ఏంటి
గర్భధారణ సమయంలో డ్రైవింగ్ చేయవచ్చా? అనే సందేహం చాలామంది మహిళలకు ఉంటుంది. గర్భం దాల్చినంత మాత్రాన వాహనం నడపకూడదనే నియమం లేదు. అయితే గర్భధారణ ఎన్ని నెలలు, ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, డ్రైవింగ్ సమయంలో ఏవైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అనే అంశాలను బట్టి నిర్ణయం తీసుకోవాలి. గర్భధారణ సాధారణంగా సాగుతూ, ఎలాంటి అసౌకర్యం లేకుండా వాహనాన్ని అదుపు చేయగలిగితే డ్రైవింగ్ సాధారణంగా సురక్షితమేనని వైద్యులు చెబుతున్నారు.
Details
మొదటి మూడు నెలలు
ఈ సమయంలో వికారం, వాంతులు, మైకం, అలసట ఎక్కువగా ఉండవచ్చు. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు డ్రైవింగ్ చేయకపోవడం మంచిది.
ప్రయాణంలో నీరు, తేలికపాటి ఆహారం వెంట ఉంచుకోవాలి. దూర ప్రయాణాలైతే మధ్యలో విరామాలు తీసుకోవాలి.
Details
నాలుగు నుంచి ఆరు నెలలు
చాలామందికి ఈ దశలో వికారం తగ్గి డ్రైవింగ్ కొంత సౌకర్యంగా ఉంటుంది. అయినప్పటికీ వెన్నునొప్పి, అలసట ఉంటే జాగ్రత్త అవసరం.
పెడల్స్ సులభంగా అందేలా సీటును సర్దుకోవాలి. స్టీరింగ్‌కు పొట్టకు మధ్య తగినంత దూరం ఉండాలి.
Details
చివరి మూడు నెలలు
పొట్ట పెరగడంతో కదలికలు, వెనుక వైపు చూడటం కష్టమవవచ్చు. బ్లైండ్ స్పాట్స్ స్పష్టంగా కనిపించకపోయినా, సీటును సౌకర్యంగా సర్దుకోలేకపోయినా స్వయంగా డ్రైవింగ్ చేయకుండా ఇతరుల సహాయం తీసుకోవాలి.
36 వారాలు దాటిన తర్వాత డ్రైవింగ్ తగ్గించడం మంచిది.
Details
ముఖ్యమైన భద్రతా జాగ్రత్తలు
సీట్ బెల్ట్‌ను పొట్టపై కాకుండా దాని కింద తుంటి ఎముకల మీదుగా ధరించాలి. భుజం మీదుగా వచ్చే బెల్ట్ ఛాతీ మధ్యలో ఉండాలి.
ఎయిర్‌బ్యాగ్స్‌ను ఆన్‌లోనే ఉంచి, స్టీరింగ్ వీల్‌కు పొట్ట కనీసం 10 అంగుళాలు (25 సెం.మీ.) దూరంలో ఉండేలా సీటును సర్దుకోవాలి.
నీరు తాగుతూ, ప్రయాణంలో కాళ్లు సాగదీస్తూ ఉండాలి. బీపీ, ప్లాసెంటా ప్రెవియా వంటి సమస్యలు ఉన్నవారు డ్రైవింగ్ లేదా సుదూర ప్రయాణాలకు ముందు వైద్యుల సలహా తీసుకోవాలి.
కడుపు నొప్పులు, రక్తస్రావం, ఉమ్మనీరు లీక్ అవడం లేదా మైకం వస్తే వెంటనే వాహనాన్ని ఆపాలి.
తల్లి, బిడ్డ భద్రతే ముఖ్యం. పరిస్థితిని బట్టి డ్రైవింగ్ చేయాలా వద్దా అనేది వైద్యుల సూచనతో నిర్ణయించుకోవాలి.