LOADING...
Promise Day 2026: వాలెంటైన్ వీక్‌లో ఐదో రోజు ప్రామిస్ డే ప్రత్యేకత ఇదే
వాలెంటైన్ వీక్‌లో ఐదో రోజు ప్రామిస్ డే ప్రత్యేకత ఇదే

Promise Day 2026: వాలెంటైన్ వీక్‌లో ఐదో రోజు ప్రామిస్ డే ప్రత్యేకత ఇదే

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 11, 2026
01:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రేమతో నిండిన వాలెంటైన్ వీక్ సందడి జోరుగా సాగుతోంది. రోజ్ డే, ప్రపోజ్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే వేడుకలు పూర్తయ్యాక... ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న కీలకమైన ఐదో రోజు 'ప్రామిస్ డే' వచ్చింది. ఫిబ్రవరి 11న జరుపుకునే ఈ రోజు, ఒక సాధారణ వేడుకగా కాకుండా, రెండు మనసుల మధ్య నమ్మకాన్ని మరింత బలపరిచే ప్రత్యేక ఘట్టంగా నిలుస్తుంది.

వివరాలు 

ప్రామిస్ డే 2026: తేదీ & ప్రాముఖ్యత

ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 11న ప్రామిస్ డే నిర్వహించడం ఆనవాయితీ. 2026లో ఈ రోజు బుధవారం వచ్చింది. వాలెంటైన్ వీక్‌లో భాగంగా ఫిబ్రవరి 7 నుంచి 14 వరకు వరుసగా ఏడు రోజులు ప్రత్యేక దినాలుగా జరుపుకుంటారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి: ఫిబ్రవరి 7 - రోజ్ డే ఫిబ్రవరి 8 - ప్రపోజ్ డే ఫిబ్రవరి 9 - చాక్లెట్ డే ఫిబ్రవరి 10 - టెడ్డీ డే ఫిబ్రవరి 11 - ప్రామిస్ డే ఫిబ్రవరి 12 - హగ్ డే ఫిబ్రవరి 13 - కిస్ డే ఫిబ్రవరి 14 - వాలెంటైన్స్ డే

వివరాలు 

ఈ రోజు ప్రత్యేకత ఏమిటి?

ప్రామిస్ డే అనేది కేవలం మాటల మార్పిడికే పరిమితం కాదు. ఎదుటి వ్యక్తిపై ఉన్న ప్రేమ, నమ్మకం, బాధ్యతలను ఒక వాగ్దానంగా ప్రకటించే సందర్భం ఇది. ఈ రోజున ప్రేమికులు, దంపతులు ఒకరికొకరు ఎల్లప్పుడూ తోడుగా ఉంటామని, సుఖదుఃఖాల్లో అండగా నిలుస్తామని హామీ ఇస్తారు. అంతేకాదు, ఇది ప్రేమికులకే కాకుండా స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య బంధాలను బలపరిచే అవకాశంగా కూడా మారుతుంది. నమ్మకాన్ని ఆధారంగా చేసుకున్న ప్రతి బంధానికి ఈ రోజు ఇచ్చే మాట గొప్ప బలం ఇస్తుంది.

Advertisement

వివరాలు 

చరిత్ర ఏమంటోంది?

ప్రామిస్ డేకు సంబంధించిన ప్రాచీన చారిత్రక కథలు లేవు. ఆధునిక కాలంలో వాలెంటైన్ వీక్ ప్రాచుర్యం పొందిన తరువాత, సంబంధాలను మరింత గట్టిగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ రోజును చేర్చారు. వాణిజ్య ప్రభావం కొంత ఉన్నా, నేటి యువత తమ భాగస్వామికి తమ నిబద్ధతను స్పష్టంగా తెలియజేయడానికి ఈ రోజును ఒక మంచి అవకాశంగా భావిస్తోంది.

Advertisement

వివరాలు 

ప్రామిస్ డేను ఎలా సెలబ్రేట్ చేయాలి?

ఈ రోజును మరపురాని అనుభూతిగా మార్చుకోవడానికి కొన్ని చక్కని ఆలోచనలు ఇవి: నిజాయతీతో కూడిన వాగ్దానం:మీరు ఇచ్చే మాట హృదయపూర్వకంగా ఉండాలి. తప్పక నెరవేర్చగల ప్రామిస్ మాత్రమే చేయడం ముఖ్యం. ప్రేమలేఖలు: డిజిటల్ యుగంలో చేతితో రాసిన ఉత్తరం ప్రత్యేకమైన భావోద్వేగాన్ని కలిగిస్తుంది.మీ భావాలను అక్షరాలుగా మార్చి వారికి అందించండి. బహుమతులు:మీ బంధాన్ని గుర్తు చేసేలా పేరు లేదా ఇద్దరి ఫోటోలతో ఉన్న గిఫ్ట్స్ ఎంపిక చేసుకోవచ్చు. స్పెషల్ డేట్:రొమాంటిక్ డిన్నర్ లేదా లాంగ్ డ్రైవ్‌కు వెళ్లి ప్రశాంతంగా గడుపుతూ భవిష్యత్తు గురించి మాట్లాడుకోవచ్చు. గమనిక: ప్రామిస్ డే రోజున ఇచ్చే మాట మీ బంధాన్ని మరింత దృఢంగా మార్చాలి. ఆరోజు ఇచ్చిన హామీని జీవితాంతం నిలబెట్టుకున్నప్పుడే,ఈ వేడుకకు నిజమైన అర్థం వస్తుంది.

Advertisement