Anant-Radhika:న్యూయార్క్ టైమ్స్ మోస్ట్ స్టైలిష్ పీపుల్ ఆఫ్ 2024'లో రాధిక మర్చంట్,అనంత్ అంబానీ..
ప్రపంచ ధనవంతులలో ల్లో ఒకరైన ముకేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, ఫార్మా దిగ్గజం వీరేన్ మర్చంట్ కుమార్తె రాధికా మర్చంట్ వివాహం ఈ ఏడాది అంగరంగ వైభవంగా జరిగింది. వారి వివాహం విశేషంగా ప్రస్తావనకు వచ్చింది, ముఖ్యంగా వారు ధరించిన దుస్తులు, ఆభరణాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాషన్ ప్రియుల్ని ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో, న్యూయార్క్ టైమ్స్ తాజాగా ప్రకటించిన 'మోస్ట్ స్టైలిష్ పీపుల్ ఆఫ్ 2024' జాబితాలో అనంత్ అంబానీ,రాధికా మర్చంట్ స్థానం పొందారు. ఈ జాబితాలో వారి పేరు పెట్టబడటానికి వివాహ సమయంలో వారు ధరించిన స్టైలిష్ దుస్తులు, ఆభరణాలు, వారి అంగరంగ వైభవంగా జరిగిన వివాహ వేడుకలు ముఖ్యాంశాలు అయినట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది.
మూడు రోజుల పాటు జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకలు
2023 జనవరిలో, అనంత్, రాధికా నిశ్చితార్థం ముంబైలోని అంబానీ నివాసం, యాంటిలియాలో జరిగింది. ఈ వివాహం 2024 జులైలో, ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో ఘనంగా జరిగింది. వివాహ వేడుకలో దేశ విదేశాల నుంచి అనేక ప్రముఖులు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. రిహన్నా, కేటీ పెర్రీ, ఆండ్రియా బోసెల్లి వంటి అంతర్జాతీయ ప్రఖ్యాతులు, ప్రపంచ దేశాల నేతలు ఆహ్వానితులుగా చేరారు. మూడు రోజుల పాటు జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో, అనంత్ మరియు రాధికా పలు విలువైన ఫాషన్ దుస్తుల్లో మెరిశారు.
భారతీయ సంప్రదాయాలకు అనుగుణంగా ఘనంగా వివాహం
వారు నిర్వహించిన వివాహ కార్యక్రమాలు భారతీయ సంప్రదాయాలకు అనుగుణంగా ఘనంగా నిర్వహించబడ్డాయి. వివాహం 'శుభ్ వివాహ్' అనే ముఖ్యమైన కార్యక్రమంతో ప్రారంభమై, 'శుభ్ ఆశీర్వాద్', 'మంగళ్ ఉత్సవ్' వంటి ఆచారాలతో ముగిసింది. వారి వివాహాన్ని పురస్కరించుకుని, అంబానీ కుటుంబం 50 పేద జంటలకు వివాహం నిర్వహించేందుకు అంగీకరించింది. వారికి బంగారం, దుస్తులు వంటి విలువైన కానుకలు అందించడం ద్వారా తమ మంచి మనస్సు చూపించారు. ఇలా, అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహం మాత్రమే కాకుండా, వారి దయాగుణాలు, శ్రద్ధతో కూడుకున్న కార్యక్రమాలు కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందాయి.