Loading...
Raksha bandhan : రాఖీ పండుగ ఏ తేదిన వస్తుంది? గ్రహణ ప్రభావమెంత?
రాఖీ పండుగ ఏ తేదిన వస్తుంది? గ్రహణ ప్రభావమెంత?

Raksha bandhan : రాఖీ పండుగ ఏ తేదిన వస్తుంది? గ్రహణ ప్రభావమెంత?

వ్రాసిన వారు Moogati Shabari
Aug 19, 2026
01:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ముల మధ్య అనురాగానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ పండుగ తేదీపై నెలకొన్న సందిగ్ధతకు పంచాంగ నిపుణులు స్పష్టతనిచ్చారు. శ్రావణ మాస పౌర్ణమి రోజున జరుపుకునే రక్షాబంధన్‌ను 2026లో ఆగస్టు 27న జరుపుకోవాలా? లేక 28న జరుపుకోవాలా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే వేద పండితులు, పురోహితుల ప్రకారం ఈ ఏడాది రక్షాబంధన్‌ను ఆగస్టు 28న జరుపుకోవాల్సి ఉంటుంది. హిందూ పంచాంగం ప్రకారం శ్రావణ శుక్ల పక్ష పౌర్ణమి తిథి 2026 ఆగస్టు 27న ఉదయం 9:08 గంటలకు ప్రారంభమై.. ఆగస్టు 28న ఉదయం 9:48 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథిని పరిగణనలోకి తీసుకోవడం ఆనవాయితీ కావడంతో.. ఆగస్టు 28న రక్షాబంధన్ పర్వదినాన్ని జరుపుకోవాలని పండితులు సూచించారు.

వివరాలు

రాఖీ కట్టే శుభ ముహూర్తం ఇదే..

ఆగస్టు 28న ఉదయం 6:23 గంటల నుంచి 9:48 గంటల వరకు రాఖీ కట్టేందుకు అత్యంత అనుకూలమైన సమయంగా పండితులు నిర్ణయించారు.

అలాగే మధ్యాహ్నం 12:14 గంటల నుంచి 1:05 గంటల వరకు ఉండే అభిజిత్ ముహూర్తంలోనూ సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టవచ్చని తెలిపారు.

వివరాలు

చంద్రగ్రహణ ప్రభావం ఉంటుందా?

రక్షాబంధన్ రోజే ఈ ఏడాది రెండో చంద్రగ్రహణం కూడా ఏర్పడనుంది.

కన్యారాశిలో సంభవించే ఈ చంద్రగ్రహణం ఉదయం 8:04 గంటల నుంచి 11:22 గంటల వరకు కొనసాగుతుంది.

అయితే ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదని పండితులు స్పష్టం చేశారు.

అందువల్ల గ్రహణానికి సంబంధించిన ఎలాంటి దోషాలు ఉండవని తెలిపారు.

ఎలాంటి ఆందోళన లేకుండా నిర్ణయించిన శుభ ముహూర్తాల్లో రాఖీ కట్టుకోవచ్చని పేర్కొన్నారు.

ADVERTISEMENT

వివరాలు

రక్షాబంధన్‌కు పౌరాణిక ప్రాశస్త్యం..

రక్షాబంధన్‌ పండుగకు సంబంధించి పలు పౌరాణిక, చారిత్రక గాథలు ఉన్నాయి.

శ్రీకృష్ణుడి చేతికి గాయమై రక్తస్రావం జరిగినప్పుడు ద్రౌపది తన చీర కొంగును చింపి ఆయన చేతికి కట్టిందని చెబుతారు.

అందుకు ప్రతిగా వస్త్రాపహరణ సమయంలో కృష్ణుడు ద్రౌపదిని రక్షించాడనే కథ ప్రచారంలో ఉంది.

అలాగే బలి చక్రవర్తికి లక్ష్మీదేవి రక్షాసూత్రం కట్టి.. విష్ణుమూర్తిని పాతాళం నుంచి తిరిగి తీసుకువచ్చిందనే కథ కూడా ఉంది.

మరోవైపు మేవార్ రాణి కర్ణావతి మొఘల్ చక్రవర్తి హుమాయూన్‌కు రాఖీ పంపి సహాయం కోరినట్లు చారిత్రక గాథలు చెబుతున్నాయి.

ఇలా రక్షాబంధన్‌ పండుగకు అనేక పౌరాణిక, చారిత్రక విశిష్టతలు ఉన్నాయి.

ADVERTISEMENT