High Protein Breakfast: తక్కువ టైమ్‌లో రెడీ.. ఎక్కువ ప్రోటీన్‌తో హెల్తీ టిఫిన్
ఈ వార్తాకథనం ఏంటి
ఉదయం నిద్రలేవగానే చాలా ఇళ్లలో ఇల్లాలిని వెంటాడే మొదటి ప్రశ్న ఒక్కటే... ఈరోజు టిఫిన్ ఏం చేయాలి? ప్రతిరోజూ ఇడ్లీ, దోశలే చేస్తూ బోర్ కొడుతుంటే, అప్పటికప్పుడు సులభంగా తయారయ్యే, ప్రోటీన్లు పుష్కలంగా ఉండే హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అయిన 'మూంగ్‌లెట్'ను తప్పక ప్రయత్నించాలి. పెసరపప్పుతో చేసే ఈ వంటకం ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా, రుచిలోనూ అద్భుతంగా ఉంటుంది. తక్కువ సమయంలో సిద్ధమయ్యే ఈ హెల్తీ రెసిపీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Details
కావాల్సిన పదార్థాలు
పెసరపప్పు (పొట్టు ఉన్నది లేదా లేనిది) - 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు - అర కప్పు టమాటా ముక్కలు క్యారెట్ తురుము క్యాప్సికం ముక్కలు తగినంత అల్లం పచ్చిమిర్చి పసుపు జీలకర్ర కొత్తిమీర పావు టీస్పూన్ వంట సోడా కాల్చడానికి సరిపడా బటర్ లేదా ఆయిల్
Details
తయారీ విధానం
ముందుగా ఒక కప్పు పెసరపప్పును శుభ్రంగా కడిగి కనీసం నాలుగు గంటల పాటు నానబెట్టాలి. ఉదయాన్నే మూంగ్‌లెట్ తయారు చేయాలనుకుంటే, ముందు రోజు రాత్రే నానబెట్టుకోవడం మంచిది. నానిన పప్పును మిక్సీ జార్‌లో వేసి, అందులో అల్లం ముక్క, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నీళ్లు కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని, జీలకర్ర, పచ్చిమిర్చి తరుగు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా, క్యారెట్ తురుము, క్యాప్సికం, కొత్తిమీర వేసి బాగా కలపాలి. చివరగా మూంగ్‌లెట్ ఫ్లఫీగా రావడానికి పావు టీస్పూన్ వంట సోడా కలపాలి. స్టవ్ మీద పాన్ పెట్టి, కొద్దిగా బటర్ లేదా ఆయిల్ వేసి వేడి చేయాలి.
Details
ఇది ఎందుకు తినాలి అంటే…
ఇప్పుడు పిండిని అర ఇంచ్ మందంలో అట్టులా పరచాలి. కావాలంటే పైన మరికొన్ని వెజిటబుల్స్ కూడా చల్లుకోవచ్చు. మంటను తక్కువలో పెట్టి, మూత వేసి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చే వరకు నెమ్మదిగా కాల్చాలి.హోటల్ స్టైల్ రుచి కావాలంటే మధ్యలో చిన్న గాట్లు పెట్టి మరికొంచెం బటర్ వేసి రోస్ట్ చేయాలి. ఈ మూంగ్‌లెట్‌ను కొత్తిమీర, పుదీనా, అల్లం, వెల్లుల్లి, జీడిపప్పు, నిమ్మరసం కలిపి చేసిన గ్రీన్ చట్నీతో తింటే రుచి మరింత పెరుగుతుంది. పెసరపప్పులో అధికంగా ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు ఉంటాయి. వెజిటేరియన్లకు ఒక నిజమైన 'సూపర్ ఫుడ్'. పిల్లల లంచ్ బాక్స్‌కు ఇవ్వడానికి అయినా, సాయంత్రం స్నాక్స్‌గా తినడానికి అయినా మూంగ్‌లెట్ ఒక సూపర్ ఛాయిస్‌గా నిలుస్తుంది.