బూడిద గుమ్మడికాయను ఆహారంలో చేర్చుకుంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకోండి
బూడిద గుమ్మడికాయను ఇంటికి వేలాడదీస్తే దిష్టిని పోగొడుందని నమ్ముతారు. కానీ దాన్ని ఆహారంగా తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఎక్కువ మందికి తెలియదు. బూడిద గుమ్మడికాయను తింటారా అని కూడా కొందరు ఆశ్చర్యపోవచ్చు. ఆ ఆశ్చర్యాన్ని మరింత పెంచే బూడిద గుమ్మడికాయ ప్రయోజాలు తెలుసుకుందాం. రోగనిరోధక శక్తిని పెంచుతుంది: ఫైబర్, కాల్షియం వంటి పోషకలతో పాటు విటమిన్ బీ1, బీ2, బీ3, విటమిన్ సి, జింక్ ఇందులో ఉంటాయి. వీటివల్ల శరీరానికి బలం చేకూరి రోగాలతో పోరాడే శక్తి వస్తుంది. బరువు తగ్గడంలో సాయపడుతుంది: కేలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ సేపు ఆకలి వేయదు. కడుపు నిండుగా ఉంటుంది. దానివల్ల తక్కువ తింటారు. ఆటీమేటిక్ గా బరువు తగ్గుతారు.
బూడిద గుమ్మడికాయ వల్ల కలిగే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు
డయాబెటిస్ నుండి రక్షిస్తుంది: కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి కాబట్టి చక్కెర వ్యాధిగ్రస్తులు దీన్ని తినవచ్చు. 2003లో కొరియన్ జర్నల్ ఆఫ్ న్యూట్రీషన్ లో ప్రచురితమైన దాని ప్రకారం, శరీరంలోకి గ్లూకోజ్ మీదా, ఇన్సులిన్ మీద బూడిద గుమ్మడికాయల్లోని పోషకాల ప్రభావం ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి. శక్తిని ఇస్తుంది: శరీరాన్ని చల్లబరిచే గుణాన్ని కలిగి ఉంటుంది బూడిద గుమ్మడికాయ. దానివల్ల మీ శ్రీర ఉష్ణోగ్రతలు అనవసర మార్పులకు లోనుకాకుండా ఉంటాయి. విటమిన్ బీ12, కావాల్సినంత ఉండడం వల్ల మన శరీరంలో శక్తి ఉత్పత్తి అవుతుంది. రక్తహీనత వల్ల బాధపడేవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళలో శక్తిని పెంచి, బద్దకాన్ని దూరం చేస్తుంది.